Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Inzamam-ul-Haq: నాకు గుండెపోటు రాలేదు.. ఆరోగ్యంగా ఉన్నాను

Inzamam-ul-Haq says I didn’t suffer heart attack

కరాచీ: తనకు గుండెపోటు వచ్చిందని మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఖండించాడు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో ఉన్న సమస్య తెలిసిందని, దానికి చికిత్స తీసుకుంటున్నానని, ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు. ఇక ఇంజమామ్ ఉల్ హక్‌కు గుండె పోటు వచ్చినట్లు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఇంజమామ్‌ గత సోమవారం రాత్రి లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు.

అక్కడ ఆయనకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇంజమామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు అతని శ్రేయోభిలాషులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు. ఈ వార్తలను చూసి అవాక్కైన ఇంజమామ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా బుధవారం క్లారిటీ ఇచ్చాడు.

'నాకు గుండెపోటు వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. కడుపులో ఇబ్బంది తలెత్తడంతో డాక్టర్‌ వద్దకు వెళ్లాను. అక్కడ నాకు మాములు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎందుకైనా మంచిదని యాంజియోగ్రఫీ కూడా చేశారు. ఆ సమయంలో నా రక్త నాళాల్లో ఒకటి కొంత మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో స్టంట్‌ వేశారు. అది సక్సెస్ అయింది. 12 గంటల తర్వాత డిశ్చార్జి కూడా చేశారు. ప్రస్తుతం మా ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను'అని ఇంజమామ్‌ చెప్పుకొచ్చాడు. తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన అభిమానులు, ప్రజలకు, సహచర ఆటగాళ్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్‌ జట్టులో సభ్యుడైన ఇంజమామ్‌ ఉల్ హ‌క్‌.. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌, కెప్టెన్‌గా మన్ననలు పొందారు. ఇంజమామ్ 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచారు. 375 మ్యాచ్‌ల్లో 11701 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థానీ ఆటగాళ్లల్లో మూడో స్థానంలో నిలిచాడు. 119 మ్యాచ్‌ల్లో 8829 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒక టీ20 మ్యాచ్ ఆడి 11 పరుగులు చేశారు. 2007 లో ఇంజమామ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత కూడా.. ఆయన పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించాడు. పీసీబీలో పలు ముఖ్యమైన పదవులను సైతం నిర్వహించారు.

Story first published: Wednesday, September 29, 2021, 19:58 [IST]
Other articles published on Sep 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+