భారత్‌ను ఓడించడం అంత తేలిక కాదు.. సఫారీకి ఓటమి భయం పట్టుకుంది: ఇంజమామ్ ఉల్ హక్

కరాచీ: సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టును ఓడించడం అంత తేలికైన పని కాదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇజమామ్ ఉల్ హక్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఉద్దేశించిన ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారని, ముఖ్యంగా చాహల్, హర్షల్ పటేల్ ప్రదర్శన అమోఘమని కొనియాడాడు. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి డీలా పడ్డ టీమిండియా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. దీంతో సిరీస్ ఆశలను భారత్ సజీవంగా నిలుపుకుంది.
ఈ నేపథ్యంలో భారత ప్రదర్శనపై స్పందించిన ఇంజమామ్-ఉల్-హక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో భారత జట్టు అంత తేలికగా ఓడిపోదని, ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఇంజమామ్ తెలిపాడు. అదే విధంగా అతను భారత బౌలర్లపై కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.
'ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. టీమిండియా విజయం సాధించడంతో ఈ సిరీస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ప్రోటీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని భావించాను. కానీ భారత బౌలర్లు సౌతాఫ్రికా విజయాన్ని అడ్డుకున్నారు.
ఇక టీమిండియా స్వదేశంలో అంత సులభంగా ఓడిపోదు. కాబట్టి ఇప్పుడు దక్షిణాఫ్రికాపై ఒత్తిడి ఉంది. టీమిండియా యువ ఆటగాళ్లు పోరాట పటిమను కనబరుస్తున్నారు.
జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేరు. అయినప్పటికీ వారు అద్భుతమైన విజయాన్ని సాధించగలిగారు. ఈ విజయం క్రెడిట్ మాత్రం జట్టులోని నలుగురు ఆటగాళ్లది. హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లు సత్తా చాటారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ అందించినటువంటి శుభారంభాలు అందితే ఏ జట్టుకు తిరుగుండదు. ఇది ఇండియా డెప్త్ బలాన్ని తెలియజేస్తుంది. ద్వితీయ శ్రేణి జట్టు ఇంత అద్భు త ప్రదర్శన కనబర్చడం గొప్ప విషయం. అండర్ 19 కోచ్‌గా ఎంతో అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండటం కలిసొచ్చే అంశం." అని ఇంజమామ్-ఉల్-హక్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications