
హైదరాబాద్: టీమిండియా వైస్ కెప్టెన్, లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌పై ప్రముఖ నటి కస్తూరి ప్రశంసల జల్లు కురిపించింది. రాహుల్ ధైర్యం తనను ఆకట్టుకుందని పేర్కొంది. ఇటీవల కేఎల్ రాహుల్ ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. సాధారణంగా క్రికెటర్లు ఇలాంటి యాడ్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ రాహుల్ మాత్రం అండర్ వేర్ కంపెనీకి ప్రచారకర్తగా ఉంటూ కొత్త సంప్రదాయానికి తెరదీసాడు. ఇదే విషయం ఇప్పుడు కస్తూరిని ఆకట్టుకుంది. కేఎల్ రాహుల్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసింది.
'క్రికెటర్లు మాములుగా కూల్ డ్రింక్స్, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, ప్రముఖ దుస్తుల బ్రాండ్లకు ప్రచారం చేయడం చూస్తుంటాం. కానీ లోదుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు మాత్రం వారు సిగ్గుపడుతుంటారు. కానీ రాహుల్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా అండర్ వేర్స్ యాడ్ చేశాడు.
రాహుల్‌ను ఈ బాక్సర్లలో చూడటం చాలా బాగుంది. ఇది పురుషుల దుస్తులకు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకువస్తుందని నమ్ముతున్నాను..' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
90వ దశకంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడలో నటించి దక్షిణాదిలో అభిమానులను సంపాదించుకున్న కస్తూరి.. పాపులర్ టీవీ సీరియల్ ఇంటింటి గృహ లక్ష్మీతో తెలుగు ప్రజలను ప్రతీ రోజు పలకరిస్తోంది. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కస్తూరికి ఇదే తొలి సారి కాదు. గతంలోనే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కస్తూరి ప్రస్తుతం తమిళ్‌లో విజయ్ ఆంటోని 'తమిళరసన్', 'ఉన్ కాదల్ ఇరుంధాల్', 'సింబా', 'గరుడ స్రూతు', 'మిస్టర్ ప్రెగ్నెంట్' వంటి చిత్రాలలో నటిస్తున్నది. తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి ద్వారా ప్రతి గడపను పలకరిస్తున్నది.
ఇక కేఎల్ రాహుల్ విషయానికొస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా జట్టు ప్లే ఆఫ్స్ చేర్చిన అతను ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఓడి ఇంటి దారి పట్టాడు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న అతను సౌతాఫ్రికాతో జరిగే 5 టీ20ల సిరీస్‌లో భారత జట్టును నడిపించనున్నాడు. జూన్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది.