
హైదరాబాద్: ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్‌లు ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో సందడి చేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ క్రికెట్ ఆడారు. కేట్ మిడిల్టన్ బౌలింగ్‌లో ప్రిన్స్ విలియమ్ సిక్స్ బాదడం విశేషం.
పాకిస్థాన్ డిజైనర్ గుల్ అహ్మద్ రూపొందించిన వైట్ కుర్తాలో కేట్ మిడిల్డన్ మెరిసిపోయారు. ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ క్రికెట్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విలియమ్, మిడిల్టన్ క్రికెట్ ఆడుతోన్న వీడియోని రాయల్ కరస్పాండెంట్ ఎమిలీ ఆండ్రూస్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
T20 World Cup 2020: ధోని తర్వాత రెండో కెప్టెన్‌గా గౌరవంగా ఉంటుంది: కోహ్లీ
బ్రిటిష్ కౌన్సిల్ దోస్తీ ప్రోగ్రామ్‌లో భాగంగా లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ది డ్యూక్, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి సందడి చేశారంటూ కెన్నింగ్టన్ ప్యాలెస్ తన అధికారిక ట్విట్టర్‌లో ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.