
మౌంట్‌మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫస్ట్ లీగ్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ(0) ప్రపంచకప్ టోర్నీలోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తోంది. మరోసారి డకౌట్‌గా వెనుదిరిగింది.
క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(22 బ్యాటింగ్)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన(37 బ్యాటింగ్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో డయానా బైగ్ ఓ వికెట్ తీసింది.
తొలిపోరులోనే పాక్‌తో భారత్ తలపడుతుండడంతో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ మ్యాచ్‌ను తిలకిస్తున్నారు. కెప్టెన్ మిథాలీ రాజ్ నేతృత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఎలాగైనా ఈ సారి కప్పు కొట్టాలని దృఢనిశ్చయంతో ఉంది. వన్డేల్లో భారత్‌కు పాక్ జట్టుపై తిరుగులేని రికార్డు ఉంది. పాక్‌తో తలపడిన పదిమ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్ రెండుసార్లు పాక్‌ను ఓడించింది.
కెప్టెన్ మిథాలీతో పాటు వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి ఇదే చివరి ప్రపంచకప్ అయిన నేపథ్యంలో.. కప్పుతో వీళ్లకు వీడ్కోలు పలకాలని జట్టు పట్టుదలతో ఉంది. పాక్‌పై ఘన విజయంతో శుభారంభం చేసి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తోంది.
భారత జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీరాజ్, రిచా గోష్(వికెట్ కీపర్), స్నేహ్ రాణా, జూలన్ గోస్వామి, మేఘన్ సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్