INDW vs NZW:ప్చ్.. రిచా ఘోష్ రికార్డు హాఫ్ సెంచరీ బాదినా.. భారత్‌కు తప్పిన ఘోర పరాభావం!

క్వీన్స్‌ల్యాండ్: న్యూజిలాండ్ గడ్డపై భారత మహిళల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో వన్డేలో కూడా మిథాలీ రాజ్ నేతృత్వంలో భారత జట్టు ఓటమి పాలైంది. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) రికార్డు హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ముందుగా బ్యాటింగ్‌లో దుమ్మురేపిన న్యూజిలాండ్ మహిళలు.. ఆ తర్వాత బౌలింగ్‌లో సత్తా చాటి 63 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేశారు.

వర్షం అంతరాయంతో..
వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను అంపైర్లు 20 ఓవర్లకే కుదించారు. ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. అమెలియా కేర్(68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగా.. ఓపెనర్లు సుజీ బేట్స్(41), సోఫియా డివైన్(32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో సాటర్‌వైట్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ రెండు వికెట్లు తీయగా.. మెఘనా సింగ్, రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.

నలుగురు డకౌట్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. 17.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. రిచా హోష్, మిథాలీ రాజ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత జట్టులో నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో అమెలియా కేర్, హేలీ జాన్సెన్ మూడేసి వికెట్లు తీయగా..జెస్ కెర్, ఫ్రాన్సెస్ మాకే రెండేసి వికెట్లు పడగొట్టారు.

19కే నాలుగు వికెట్లు...
ఇక 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికీ 19 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(0), యస్తిక భాటియా(0) డకౌటవ్వగా.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న పూజా వస్త్రాకర్(4), స్మృతి మంధాన(13) తీవ్రంగా నిరాశపరిచారు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి రిచా గోష్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది.

రిచా రికార్డు హాఫ్ సెంచరీ
భారీ సిక్సర్లు, ఫోర్లతో వేగంగా ఆడింది. ఈ క్రమంలో 26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిచా ఘోష్.. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన తొలి మహిళా బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. ఆమె జోరుకు జెన్సన్ బ్రేక్ వేయడంతో మరో 32 పరుగుల వ్యవధిలోనే భారత్ కుప్పకూలింది. ఇప్పటికే ఏకైక టీ20 మ్యాచ్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌లో వరుసగా నాలుగు పరాజయాలను భారత మహిళల జట్టు చవిచూసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications