స్టన్నింగ్ క్యాచ్ పట్టిన భారత మహిళా క్రికెటర్!చప్పట్లు కొట్టిన ఇంగ్లండ్ ప్లేయర్ (వీడియో)

నార్తాంప్టన్ (యూకే): జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, బ్రెండన్ మెక్‌కల్లమ్, జాకబ్ ఓరమ్, రవీంద్ర జడేజా, స్టీవ్ స్మిత్, కిరన్ పోలార్డ్ ఇలా చెప్పుకుంటే పొతే ఎందరో పురుష క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్‌లు ఉన్నారు. మహిళల క్రికెట్‌లో మాత్రం ఈ సంఖ్య వేళ్లమీద ఉంటుంది. ఇప్పుడిప్పుడే వుమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్‌గా నీరాజనాలు అందుకుంటున్న జడేజాను తలపించింది ఇండియన్ వుమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన. బౌండరీ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరి క్యాచ్ అందుకుంది. తాజాగా అంతకుమించి ఫీల్డింగ్‌ను తలపించింది మరో భారత మహిళా క్రికెటర్.

జోన్స్ భారీ షాట్
ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల వన్డే సిరీస్‌లో ఓపెనర్ స్మృతి మంధాన బౌండరీ లైన్ వద్ద 'సూపర్ వుమెన్'లా డైవ్ చేసి క్యాచ్ అందుకోగా.. తాజాగా టీ20 సిరీస్‌లో యువ బ్యాట్స్‌మన్ హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్ అందుకుని ఔరా అనిపించింది. నార్తాంప్టన్ కంట్రీ గ్రౌండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హిట్టర్ అమీ జోన్స్ (43: 27 బంతుల్లో 4x4, 2x6) దూకుడుగా ఆడుతోంది. ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకోవడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తోంది. 19వ ఓవర్ వేసిన భారత పేసర్ శిఖా పాండే బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా జోన్స్ భారీ షాట్ ఆడింది. బంతి బౌండరీ లోపల పడేలా కనిపించింది. ఇక్కడే హర్లీన్ మాయ చేసింది.
మైదానంలోకి డైవ్ చేసి
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ సిక్స్‌గా వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకుంది. అయితే ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పిపోయిన డియోల్.. బౌండరీ లైన్ లోపలికి వెళ్లబొయింది. ఇది గ్రహించిహిన డియోల్.. రెప్పపాటులో బంతిని మైదానంలోకి ఎగరేసింది. ఆ తర్వాత బౌండరీ లైన్ లోపల అడుగుపెట్టి.. మళ్లీ మైదానంలోకి డైవ్ చేసి బంతిని క్యాచ్‌గా అందుకుంది. ఈ క్రమంలో ఆమె కాసేపు గాల్లోనే ఉండిపోయింది. ఈ క్యాచ్ అద్భుత క్యాచ్ చూసిన ఇంగ్లండ్ ప్లేయర్ చప్పట్లతో అభినందించింది. ఆ సమయంలో ఆమె కూడా బౌండరీ లైన్ వద్దే ఉంది.

ఇదే అత్యుత్తమ క్యాచ్
హర్లీన్ డియోల్ క్యాచుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. డియోల్ పట్టిన క్యాచ్ చూసి మాజీ క్రికెటర్లతో పాటు ట్విటర్ యూజర్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'సూపర్ ఉమెన్' 'రవీంద్ర జడేజాను మించిపోయావ్', 'వావ్ ఫెంటాస్టిక్ క్యాచ్' అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. మహిళా క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ క్యాచ్‌గా మాజీ క్రికెటర్లు అభివర్ణిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఇషా గుహ 'బ్యూటీ హర్లీన్ డియోల్' అని క్యాచ్ వీడియో పోస్ట్ చేసింది. భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జారీఫైనా మూడో వన్డేలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుత క్యాచ్ అందుకుంది.

ఇంగ్లండ్ విజయం
తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. నటాలియే సివర్ (55) అర్ధ శతకం చేయగా.. జోన్స్ (43) రాణించింది. అనంతరం ఛేదనలో భారత్ జట్టు 8.4 ఓవర్లు ముగిసే సమయానికి 54/3తో నిలిచిన దశలో వర్షం పడింది. దాంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
Wimbledon 2021 ఫైనల్లో జకోవిచ్.. బెరిటినితో టైటిల్ పోరు! అత్యధిక టైటిళ్ల రికార్డుకు అడుగు దూరంలో జకో!!