Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2021 ఫైనల్లో జకోవిచ్‌.. బెరిటినితో టైటిల్ పోరు! అత్యధిక టైటిళ్ల రికార్డుకు అడుగు దూరంలో జకో!!

Wibledon 2021:Serbian star Novak Djokovic enters finals after beating Canadas Denis Shapovalov

లండన్‌: వింబుల్డన్‌ 2021లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) రాకెట్ వేగంతో దూసుకెళుతున్నాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో జొకోవిచ్‌ 7-6 (7/3), 7-5, 7-5తో కెనడా ఆటగాడు డెన్నిస్‌ షపవ్‌లోవ్‌ను ఓడించాడు. దీంతో ఏడోసారి వింబుల్డన్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో ఇటలీ ప్లేయర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ బెరెటినితో జొకోవిచ్‌ తలపడతాడు. మరోవైపు అత్యధిక సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన రోజర్ ఫెదరర్‌, రఫెల్ నాదల్‌ (20 టైటిళ్లు)లను సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న జకో.. ఆ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు.

నొవాక్‌ జొకోవిచ్‌, డెన్నిస్‌ షలోపవ్‌వ్‌ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ 2 గంటల 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ఎంతో అనుభవం ఉన్న జకోకు కుర్రాడు షలోపవ్‌వ్‌ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అయితే కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన షపోవలోవ్‌ కీలకదశలో తడబడి మూల్యం చెలించుకున్నాడు. తొలి సెట్‌ ఆరంభంలోనే జొకోవిచ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన షపవ్‌లోవ్‌.. ఒక దశలో 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. జకో పుంజుకోవడంతో సెట్‌ టై బ్రేకర్‌కు దారితీసింది. టై బ్రేకర్‌లోనూ దూకుడుగా ఆడిన సెర్బియా స్టార్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. పదకొండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జకో అదే జోరుతో సెట్‌ గెలిచాడు. మూడో సెట్‌లో జకో జోరు కొనసాగింది.

మరో సెమీస్‌లో ఏడో సీడ్‌ మాటియో బెర్‌టిని (ఇటలీ) 6-3, 6-0, 6-7 (3/7), 6-4తో అన్‌సీడెడ్‌ హుబర్ట్‌ హుర్కాజ్‌ (పోలాండ్‌)పై గెలుపొందాడు. క్వార్టర్స్‌లో దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు షాకిచ్చిన హర్కాజ్‌.. ఆ జోరును మాత్రం ఈ మ్యాచ్‌లో చూపించలేపోయాడు. మ్యాచ్ ఆరంభం నుంచే బెరిటిని దూకుడుగా ఆడాడు. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లు, బుల్లెట్‌ సర్వీసులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టిన బెరిటిని ఎక్కువగా కష్టపడకుండానే తొలి రెండు సెట్లను చేజిక్కించుకున్నాడు. మూడో సెట్లో తేలిపోయినా.. నాలుగో సెట్లో సత్తాచాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బెరెటిని 22 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. ఈ విజయంతో 45 ఏళ్ల తర్వాత పురుషుల విభాగంలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరుకు చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

వింబుల్డన్‌ 2021 మహిళల సింగిల్స్‌ ఫైనల్ శనివారం జరగనుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌, ఆస్ట్రేలియా స్టార్‌ ఆష్లే బార్టీతో కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో తలపడనుంది. 2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన బార్టీ.. రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేయగా.. ప్లిస్కోవా తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతోంది. ఎవరు గెలిచినా వింబుల్డన్‌లో కొత్త విజేత రానుంది.

Story first published: Saturday, July 10, 2021, 9:56 [IST]
Other articles published on Jul 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+