Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rinku Singh: భారీ సిక్స్‌లు కొట్టడానికి అదే కారణం.. పుట్టుకతో వచ్చిన బలం!

IND vs AUS: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. తన పవర్ హిట్టింగ్ వెనుక ఉన్న సీక్రెట్ తెలియజేశాడు. ప్రతీ రోజు వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడమే తన పవర్ హిట్టింగ్‌కు ప్రధాన కారణమని చెప్పాడు. మంచి డైట్‌తో పాటు పుట్టుకతో వచ్చిన బలం కూడా భారీ సిక్సర్లు కొట్టడంతో ఉపయోగపడుతుందని రింకూ సింగ్ తెలిపాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో రింకూ సింగ్.. బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి దుమ్మురేపాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో తన పవర్ హిట్టింగ్‌తో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా సిక్స్‌లు బాదుతూ మహేంద్ర సింగ్ ధోనీని తలపిస్తున్నాడు.

IND vs AUS: Rinku Singh reveals on how he hits big sixes

రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో రింకూ సింగ్ దుమ్మురేపాడు. 29 బంతుల్లోనే 46 పరుగులు చేసి భారత్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయేస్ అయ్యర్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట.. రింకూ సింగ్ అలవోకగా సిక్సర్లు, బౌండరీలు బాదాడు.
అయితే ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ కొట్టిన ఓ సిక్సర్ వంద మీటర్ల దూరం వెళ్లింది.

భారత ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఈ భారీ సిక్సర్ నమోదైంది. ఆసీస్ బౌలర్ ద్వార్షుయిస్ వేసిన బంతిని రింకూసింగ్ 100 మీటర్ల దూరం బాదాడు. దాంతో ఈ సిరీస్‌లో భారీ సిక్సర్ రింకూ సింగ్ పేరిట నమోదైంది. మ్యాచ్ అనంతరం జితేశ్ శర్మతో కలిసి సరదాగా మాట్లాడిన రింకూ సింగ్ తన పవర్ హిట్టింగ్ వెనుక ఉన్నకారణాన్ని తెలియజేశాడు.

'జితేష్ శర్మతో కలిసి ప్రతీ రోజు జిమ్ చేస్తా. మంచి ఆహారం తీసుకుంటా. బరువులు ఎత్తడం అంటే నాకు చాలా ఇష్టం. దాంతో సహజంగానే నాలో బలం ఉంది. పుట్టుకతో సిక్సర్లు బాదే పవర్ వచ్చింది.'అని రింకూ సింగ్ తెలిపాడు. ఐపీఎల్ ఆడటం వలన ఒత్తిడిలో ఎలా ఆడాలనే దానిపై అవగాహన వచ్చిందని చెప్పుకొచ్చాడు.

రింకూ ఇలానే కొనసాగితే టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాకు కీలకం కానున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నేడు(ఆదివారం) జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Sunday, December 3, 2023, 8:14 [IST]
Other articles published on Dec 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+