INDvAUS: భారత పర్యటనకు ముందు ఆసీస్‌కు గట్టి షాక్.. గాయాలతో ఆ ముగ్గురు ఆటగాళ్లు దూరం!

న్యూఢిల్లీ: మూడు టీ20ల సిరీస్ కోసం భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ గాయాలతో ఈ పర్యటనకు దూరమయ్యారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు ఈ ముగ్గురు ఆటగాళ్లు గాయపడటం ఆ జట్టును కలవరపెడుతోంది.
భారత పర్యటనకు ఎంపికైన ఈ ముగ్గురు ఇటీవలే న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గాయపడ్డారు. మిచెల్ స్టార్క్ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. మిచెల్ మార్ష్ చీల మండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. మార్కస్ స్టోయినిస్ పక్కటెముకల గాయంతో భారత్ పర్యటనకు దూరమయ్యాడు.

ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో గాయపడ్డ ఈ ముగ్గురికి భారత పర్యటన నుంచి విశ్రాంతిని కల్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. వారి స్థానాల్లో నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్, సీన్ అబాట్‌లను ఎంపిక చేసింది. ఇక డేవిడ్ వార్నర్ ఈ పర్యటనతో పాటు ముందు జరిగిన సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. గాయపడ్డ స్టార్క్, మార్ష్, స్టోయినీస్ సేవలను కోల్పోవడం ఆసీస్ జట్టుకు తీరని లోటే. మొకాలి స్కాన్ రిపోర్ట్‌లు ఈ రోజే రావడంతో స్టార్క్ చివరి నిమిషంలో భారత పర్యటనకు దూరమయ్యాడు.

సొంతగడ్డపై రీఎంట్రీ..
మార్ష్, మార్కస్ స్టోయినిస్ మాత్రం ముందుగానే గాయపడ్డారు. ఇక డేవిడ్ వార్నర్, మార్ష్, స్టోయినిస్.. ప్రపంచకప్ ముందు సొంతగడ్డపై వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. భారత పర్యటనకు ఎంపికైన టీమ్ డేవిడ్.. స్టోయినిస్ గైర్హాజరిలో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీ టీ20ల్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మార్ష్ గైర్హాజరీలో కామెరూన్ గ్రీన్ జట్టుతో కలవగా.. స్టీవ్ స్మిత్ నంబర్ 3లో ఆడనున్నాడు. జోష్ ఇంగ్లిస్.. ఆరోన్ ఫించ్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ నెల 20, 23, 25 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత పర్యటనకు రానున్న ఆసీస్ టీమ్..
సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టీమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, జోస్ హజెల్ వుడ్, జోష్ ఇంగ్లీస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్సన్, డానియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications