India vs England: ఎంఎస్ ధోనీ సలహాలు.. నన్ను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయి: ఇంద్రాణి రాయ్

ఝార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని భారత మహిళా వికెట్‌కీపర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కలని, ఇంగ్లండ్ పర్యటనతో అది నిజం కాబోతుందన్నారు. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం చాలా సంతోషకరమని ఇంద్రాణి రాయ్ చెప్పుకొచ్చారు. బోయే సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. రాయ్‌కు టెస్టు, వన్డే, టీ20 జట్టులో చోటు దక్కింది.

2018లో ఝార్ఖండ్‌కు
ఇంద్రాణి రాయ్‌ది పశ్చిమ్ బెంగాల్. అండర్-19, అండర్-23 వరకు అక్కడే ఆడారు. అక్కడ ఆమె బ్యాటర్‌గా మాత్రమే కొనసాగారు. బెంగాల్ జట్టులో వికెట్ కీపర్లు ఎక్కువ మంది ఉండటంతో.. 2018లో ఝార్ఖండ్‌కు మారారు. రాంచీలో సాధన చేస్తున్నప్పుడు ఆమె క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని చాలాసార్లు కలిశారు. వికెట్ కీపింగ్‌పై ఆమెకు మహీ ఎన్నో సలహాలు ఇచ్చాడు. తన చుట్టూ ఐదు మీటర్ల పరిధిలో ఎలా ఉండాలో అతడి నుంచి మెలకువలు నేర్చుకొన్నారు రాయ్. ఆ సలహాలతో అద్భుత వికెట్‌కీపర్‌గా మారారు. ఇప్పుడు ఏకంగా భారత జట్టులోకి ఎంపికయ్యారు.

ధోనీ విలువైన సలహాలు ఇచ్చారు
తాజాగా ఇంద్రాణి రాయ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'టెస్టు క్రికెట్ ఆడాలన్నది నా కల. ఇంగ్లండ్ పర్యటనలో మూడు ఫార్మాట్లకు ఎంపికవ్వడంతో ఇప్పుడు నా కలకు చేరువయ్యాను. బెంగాల్‌కు ఆడేటప్పుడు కీపింగ్ చేసే అవకాశం రాలేదు. 2018లో విరామం తీసుకొని ఝార్ఖండ్‌కు మారాను. రాంచీ మైదానంలో సాధన చేసేటప్పుడు మహీ భాయ్ నాకు విలువైన సలహాలు ఇచ్చారు. నా చుట్టూ ఐదు మీటర్ల పరిధిలో కదలికలను ఆయన వల్లే మెరుగు పర్చుకున్నా. ఈ క్రెడిట్ అంతా ఆయనకే. నేనెప్పుడూ మహీ ఆటను పరిశీలిస్తుంటాను' అని తెలిపారు.
WTC Final: 'న్యూజిలాండ్‌ని ఓడిస్తాం.. టెస్టు ఛాంపియన్‌షిప్ గెలుస్తాం'

మగ పిల్లలతో కలిసి సాధన చేస్తుంటా
'మగ పిల్లలతో కలిసి నేనెప్పుడూ సాధన చేస్తుంటా. అప్పుడు వారి ప్రమాణాలను అందుకొనేందుకు ప్రయత్నించేదాన్ని. అది కూడా నాకు ఎంతో ఉపయోగపడింది. బాగా కష్టపడేందుకు నా తల్లి సైతం స్ఫూర్తినిచ్చింది. ఝార్ఖండ్ జట్టులో ఎదిగేందుకు సీమా సింగ్ సాయం చేసింది. ఝార్ఖండ్ జట్టు మొత్తం నాకు అండగా నిలిచింది. టీమిండియాకు ఎంపికవ్వడాన్ని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నా. మిథాలీ రాజ్, జులన్ గోస్వామితో డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప సందర్భం' అని ఇంద్రాణి రాయ్ పేర్కొన్నారు. అవధ్ యూనివర్సిటీలో రాయ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివారు.

టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూన్ 16-19 వరకు బ్రిస్టల్‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 27న బ్రిస్టల్ మొదటి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ,రెండవ వన్డే (డే-నైట్) జూన్ 30న టౌంటన్‌లో జరుగుతుంది. ఇక చివరిదైన మూడవ వన్డే జూన్ 3న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ జూలై 9న నార్తాంట్స్‌లో, రెండో టీ20 జూలై 11 హోవ్‌లో, మూడో టీ20 జూలై 15న చెల్మ్స్ ఫోర్డ్‌లో షెడ్యూల్ అయి ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications