బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వచ్చే నెలలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టుతో టీమిండియా బరిలోకి దిగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ టోర్నీల నేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లంతా టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉండనున్నారు.
ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు వెటరన్ ప్లేయర్లు పునరాగమనం చేసే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోనున్నారు. ఇషాన్ కిషన్‌ను స్పెషలిస్ట్ ఓపెనర్‌గా ఎంచుకునే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలు ఎంపికవ్వచ్చు.

జితేశ్ శర్మను పక్కన పెడితే తిలక్ వర్మకు చోటు దక్కుతుంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు. రియాన్ పరాగ్, రింకూ సింగ్‌లు కూడా జట్టులో కొనసాగనున్నారు. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైతే అతను ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్.. బౌలింగ్ సామర్థ్యం కలిగిన బ్యాటర్లకే ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యే భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్/తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ(కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్
తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్(కీపర్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా