Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: నో బుమ్రా, కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌ నేపథ్యంలో భారత ఆటగాళ్లంతా బిజీగా ఉన్నారు. మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరపడనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్.. ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్ట్ 4 వరకు అక్కడే ఉండనుంది. ఈ సుదీర్ఘ పర్యటన అనంతరం భారత్.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ వేదికగా ఆగస్ట్ 17న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడే ఆటగాళ్లకు ఈ వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించనున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానంతరం భారత్ ఆడే వన్డే ఫార్మాట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం.

టార్గెట్ వన్డే ప్రపంచకప్..
అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ 2027 కోసం టీమిండియా సన్నాహకాలు ప్రారంభించనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లను ఈ ఫార్మాట్‌కు దూరంగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం ఈ ఇద్దరి ఆటగాళ్ల భవితవ్యంపై క్లారిటీ రానుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికి వన్డే, టెస్ట్‌లు మాత్రమే ఆడుతున్నారు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ‌లు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

India s Squad For Bangladesh ODIs No Virat Kohli and Jasprit Bumrah Samson IN

సంజూకు ఛాన్స్..?
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లకు బంగ్లాదేశ్ పర్యటన నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అయ్యర్ కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తే అతను కూడా దూరమవుతాడు. ఫిట్‌నెస్ సాధిస్తే సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వన్డే జట్టులో చోటు దక్కించుకుంటారు. ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్‌లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా తిరిగి వన్డే జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్‌లకు కూడా అవకాశం దక్కనుంది.

బంగ్లాదేశ్‌ పర్యటనకు భారత వన్డే జట్టు(అంచనా)
సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, ఆర్ సాయి కిషోర్, ప్రసిధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్.

Story first published: Friday, May 2, 2025, 17:26 [IST]
Other articles published on May 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+