Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: రిషభ్ పంత్ దూరం.. వైస్ కెప్టెన్ ఎవరంటే?

ఆసియా కప్ 2025 టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా.. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఒకవేళ భారత్ ఆసియాకప్ 2025 ఫైనల్ చేరితే.. నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ సిరీస్‌కు సిద్దం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సిరీస్ బరిలోకి దిగే భారత జట్టు ఎంపికపై భారత సెలెక్షన్ కమిటీ ఫోకస్ పెట్టింది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో స్వల్ప మార్పులతో టీమ్‌ను ప్రకటించనుంది.

ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ రిషభ్ పంత్.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది. అతనికి బ్యాకప్ వికెట్ కీపర్‌గా నారయణ్ జగదీషన్ జట్టులోకి రానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరించాడు. అతని గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కనున్నాయి.

India s Probable Test Squad for West Indies Series No Rishabh Pant KL Rahul Vice-Captain Shreyas Iyer Returns

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా.. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో అతనిపై వేటు పడనుంది. ఆసియా కప్ 2025 టోర్నీకి దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత్-ఏ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా-ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు.

ఐదో స్థానంలో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు. అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఎక్స్‌ట్రా పేసర్లుగా ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్‌కు అవకాశం దక్కనుంది.

వెస్టిండీస్‌తో ఆడే భారత టెస్ట్ టీమ్ ఇదే: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, నారయణ్ జగదీషన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.

Story first published: Sunday, September 21, 2025, 17:28 [IST]
Other articles published on Sep 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+