Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: అఫ్గాన్‌తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి నామమాత్రపు పోరుకు సిద్దమైంది. శనివారం చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డేలో అఫ్గాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని అఫ్గాన్ భావిస్తోంది.

ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో బెంచ్ బలాన్ని పరీక్షించే యోచనలో టీమిండియా మేనేజ్‌‌మెంట్ ఉంది. ఈ క్రమంలోనే మూడో వన్డేకు భారత తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌తోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీకి కావాల్సిన కాంబినేషన్ కోసం ప్రయోగాలు చేస్తామని సిరీస్ ప్రారంభానికి ముందే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు.ఈ క్రమంలోనే మూడో వన్డేలో బెంచ్ ఆటగాళ్లను పరీక్షించనున్నారు.

India s Predicted Playing XI for 3rd ODI vs Afghanistan Harshit Rana IN 2 Players OUT

యశస్వి జైస్వాల్‌కు మరో ఛాన్స్..?

గత మ్యాచ్‌లో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని యశస్వి జైస్వాల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైస్వాల్ తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే ఆఖరి వన్డేలో అతనికి మరో ఛాన్స్ ఇస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ అతను బరిలోకి దిగితే ఒక బ్యాటర్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తారా? లేక రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్‌లో ఒకరు తప్పుకుంటారా? అనేది చూడాలి.

నితీష్ రెడ్డి రీఎంట్రీ..?

తొడ నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన నితీష్ రెడ్డి ఈ మ్యాచ్ ఆడుతాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ అతను ఆడితే టీమిండియాకు ఎక్స్‌ట్రా బ్యాటర్ అవసరం లేదు. నితీష్ అందుబాటులోకి రాకుంటే గత మ్యాచ్ తరహాలోనే టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగనుంది.

హర్షిత్ రాణాకు చోటు..

మోకాలి గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణాకు తుది జట్టులో చోటు దక్కనుంది. అతన్ని పేస్ ఆల్‌రౌండర్‌గా టీమిండియా ఉపయోగించనుంది. హర్షిత్ రాణా రాకతో అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతి కల్పించనున్నారు. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌తో కలిసి హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

కుల్దీప్ యాదవ్ కొనసాగనే..?

గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్‌కు మరో అవకాశం ఇస్తారా? లేక తొలి మ్యాచ్‌లో తీన్మార్ బౌలింగ్‌తో సత్తా చాటిన హర్ష్‌దూబేను ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన వాషింగ్టన్ సుందర్‌కు విశ్రాంతినిస్తారా? అనేది కూడా చూడాలి. కుల్దీప్ యాదవ్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు.

అఫ్గాన్‌తో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్/ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్/హర్ష్‌దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్,

అఫ్గాన్‌తో సిరీస్ భారత వన్డే టీమ్

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.

Story first published: Saturday, June 20, 2026, 6:45 [IST]
Other articles published on Jun 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+