For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: సంజూ, రింకూ ఔట్.. ఆసియా కప్ బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!

ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఆసియా టోర్నీకి తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ కోసం ఆసియా క్రికెట్ దేశాలు సిద్దమయ్యాయి. ఆతిథ్య యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్‌లు బరిలోకి దిగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.

సెప్టెంబర్ 10న(బుధవారం) ఆతిథ్య యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14(ఆదివారం) దాయాదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం యూఏఈ చేరుకున్న సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. అయితే ఈ టోర్నీలో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

India s Playing XI For Asia Cup 2025 Sanju Samson and Rinku Singh OUT

సంజూకు నో ఛాన్స్..

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియా కాంబినేషన్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారని చెప్పిన ఆకాష్ చోప్రా.. సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు ఉండదని అంచనా వేసాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసిన సంజూ మూడు శతకాలు చేశాడు. అయినా సంజూ కంటే శుభ్‌మన్ గిల్ బెటర్ ఆప్షన్ అని చోప్రా అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్ కావడంతో సంజూ శాంసన్‌‌కు ఆప్షన్ లేకుండా పోయిందన్నాడు.

మూడో స్థానంలో తిలక్ వర్మను కొనసాగుతాడని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, శివమ్ దూబే మిడిలార్డర్‌లో ఆడుతారని తెలిపాడు. లెఫ్టాండర్ కావాలనుకుంటే శివమ్ దూబే ఇంకాస్త ముందుగా బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నాడు. తద్వారా టీమిండియాకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా అవసరమైతే అక్షర్ పటేల్‌తో పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయవచ్చని తెలిపాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ‌కి ఓటేసిన ఆకాష్ చోప్రా.. కుల్దీప్ యాదవ్‌ను విస్మరించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు పేసర్లుగా బరిలోకి దించాలని చెప్పాడు.

ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత తుది జట్టు(ఆకాష్ చోప్రా అంచనా)

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.

Story first published: Monday, September 8, 2025, 13:05 [IST]
Other articles published on Sep 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+