వైభవ్ సూర్యవంశీ ఇన్.. సంజూ ఔట్! ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం తొలి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. రెండు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా శుక్రవారం తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుండగా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2028 రోడ్ మ్యాప్ మొదలవ్వనుంది. ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు.
జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే అతను టీమిండియా జెర్సీని అందుకున్నాడు. కొత్త ఆటగాళ్ల చేరికతో టీమిండియా కాంబినేషన్‌లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం..
ఐర్లాండ్‌తో శుక్రవారం(జూన్ 26) జరిగే తొలి టీ20 మ్యాచ్‌తోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ ఫీట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా వైభవ్ నిలవనున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టనున్నాడు.

శ్రీలంక గడ్డపై ఇటీవల ముగిసిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. ఫైనల్లో అసలు సిసలు ఆటతో చెలరేగాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.. 29 బంతుల్లో 94 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
సంజూ శాంసన్ ఔట్..
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంతో సంజూ శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో సంజూ శాంసన్ అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. సీనియర్‌గా అతనికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం వైభవ్ సూర్యవంశీ బెంచ్‌పై కూర్చోవాల్సి ఉంటుంది. కానీ అదే జరిగితే టీమిండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వస్తాయి.
వైభవ్ బరిలోకి దిగితే సంజూ, ఇషాన్ కిషన్‌లో ఒకరు ఉద్వాసనకు గురవుతారు. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. సంజూ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నాడు. సంజూ, ఇషాన్ ఆడించాలనుకుంటే ఓ పేస్ ఆల్‌రౌండర్‌ను పక్కనపెట్టవచ్చు. గంభీర్ చర్యలను ఊహించడం కష్టం. కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
ప్రిన్స్ యాదవ్‌కు నిరాశే..
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడనుండగా.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. గాయంతో ఈ సిరీస్‌కు వరుణ్ చక్రవర్తీ దూరం కాగా.. కుల్దీప్ యాదవ్ ఎంపికవ్వలేదు. రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ప్రిన్స్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
ఐర్లాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

