ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో పడిలేచిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు సాధించింది.

ఇంగ్లండ్ పర్యటన అనంతరం టీమిండియాకు 35 రోజుల విశ్రాంతి లభించనుంది. ఆసియా కప్ 2025 వరకు టీమిండియాకు మ్యాచ్‌లు లేవు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో అక్టోబర్‌లో సొంతగడ్డపై రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఎంపికయ్యే భారత జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగుతుంది. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్ గడ్డపై అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగనున్నారు.
బంగారం లాంటి అవకాశాన్నిచేజార్చుకున్న కరుణ్ నాయర్‌పై వేటు పడనుంది. 8 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ 8 ఇన్నింగ్స్‌ల్లో 25.62 సగటుతో 205 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. మరోవైపు సాయి సుదర్శనత్ అతని కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. దాంతో వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసే జట్టులో కరుణ్ నాయర్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వవచ్చు.
అతనికి భారత గడ్డపై మెరుగైన రికార్డ్ ఉంది. పైగా జట్టులో చోటు కోసం అతను మరింత ఫిట్‌గా తయారయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై అవకాశం అందుకోని అభిమన్యు ఈశ్వరన్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ కూడా కోలుకొని జట్టులోకి రానున్నాడు. రిజర్వ్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ కొనసాగనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్‌ను విశ్రాంతి ఇవ్వవచ్చు. ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణలు జట్టులో కొనసాగనున్నారు.
శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ