టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం మీడియాకు వెల్లడించాడు. 42 ఏళ్ల అమిత్ మిశ్రా.. తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్ తరఫున 22 టెస్ట్‌లు, 36 వన్డేలు, 10 టీ20 మాత్రమే ఆడి వరుసగా 76, 64, 16 వికెట్లు పడగొట్టాడు. గాయాల బెడదతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
'నా 25 ఏళ్ల క్రికెట్ జీవితం చిరస్మరణీయం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేష అధికారులు, సహాయక సిబ్బంది, నా సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నేను ఎక్కడ, ఎప్పుడు ఆడినా మద్దతు ఇచ్చి, ప్రేమ చూపిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వారి వల్లే నా క్రికెట్ ప్రయాణం మరింత చిరస్మరణీయమైంది. క్రికెట్ నాకు లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను, అమూల్యమైన పాఠాలను ఇచ్చింది. మైదానంలో నేను గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుంచుకునే మధుర జ్ఞాపకమే.'అని ఓ వార్త సంస్థతో అమిత్ మిశ్రా అన్నారు.

అమిత్ మిశ్రా.. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ట్రై సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2008లో ఆస్ట్రేలియాతో మోహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అమిత్ మిశ్రా.. 2010లో జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. 2013లో జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టి జవగళ్ శ్రీనాథ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్‌ను అమిత్ మిశ్రా సమం చేశాడు. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఆడిన మిశ్రా 10 వికెట్లు తీసాడు. ఈ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
2017లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మిశ్రా.. ఐపీఎల్‌తో దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు. ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌ను 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాడు. ఈ ఏడాది టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడిన మిశ్రా 23.82 సగటు, 7.37 ఎకానమీతో 174 వికెట్ల పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏడో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు హ్యాట్రిక్స్ తీసిన ఏకైక బౌలర్ అమిత్ మిశ్రానే కావడం విశేషం.
2008లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించిన అమిత్ మిశ్రా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 2011లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2013లో హ్యాట్రిక్ వికెట్ తీసాడు. కోచ్‌గా, కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని అమిత్ మిశ్రా భావిస్తున్నాడు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌తో ప్రేక్షకులతో టచ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు.