For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: రాహుల్ ఫామ్‌పై నో టెన్షన్.. పుణె టెస్ట్ ఆడుతాడు: టీమిండియా కోచ్

పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ అండగా నిలిచాడు. రాహుల్ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అతను టచ్‌లోనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులే చేసి వెనుదిరిగాడు. రాహుల్ వైఫల్యం టీమిండియా ఓటమికి ఓ కారణమైంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ స్థానంలో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర శతకం చెలరేగాడు.

India s coach Ryan Ten Doeschate says no concerns about KL Rahul s form ahead of IND vs NZ 2nd Test

రాహుల్‌పై వేటు పడేనా..?
150 పరుగులతో భారత జట్టును ఆదుకున్నాడు. దాంతో పుణె వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇస్తే.. రాహుల్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లోరూ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతని పేలవ ఫామ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది.

రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చెట్.. రాహుల్ ఫామ్‌పై ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పాడు.

పిచ్ కండీషన్స్‌కు తగ్గట్లు..
టీమిండియాలోని ఆరు స్థానాలను ఏడుగురితో భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పిచ్ కండిషన్స్ తగ్గట్లు తుది జట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని ర్యాన్ టెన్ చెప్పుకొచ్చాడు. 'తుది జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తొలి టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. గత టెస్ట్ అనంతరం కేఎల్ రాహుల్ దగ్గరకు వెళ్లి ఎన్ని బంతులు ఆడావు.. ఎన్ని బంతులు వదిలేసావ్? అని అడిగాను.

India s coach Ryan Ten Doeschate says no concerns about KL Rahul s form ahead of IND vs NZ 2nd Test

అతను ఒక్క బంతి ఆడలేదని, ఒక బంతిని వదిలేసానని చెప్పాడు. పరుగులు రానప్పుడు ఇలా జరగడం సహజమే. ఈ మ్యాచ్‌లో అతను రెండు బాల్స్ ఆడాడు. ఒకటి డౌన్ ద లెగ్ సైడ్ వెళ్లగా.. మరోకొటి ఎడ్జ్ అయ్యింది. కాబట్టి రాహుల్ బ్యాటింగ్‌పై ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతను మానిసికంగా బలంగా ఉన్నాడు. కానీ ఆరు స్థానాలకు ఏడుగురు బ్యాటర్లు ఉన్నారు. పిచ్ కండిషన్స్ తగ్గట్లు తుది నిర్ణయం తీసుకుంటాం.'అని ర్యాన్ టెన్ చెప్పుకొచ్చాడు.

పంత్ గాయం అప్‌డేట్..
రిషభ్ పంత్ గాయం గురించి మాట్లాడుతూ.. అతను వేగంగా కోలుకుంటున్నాడని, పుణె టెస్ట్‌ ఆడుతాడని ఆశిస్తున్నామని తెలిపాడు. పంత్ మోకాలి మూవ్‌మెంట్ కాస్త అసౌకర్యంగా ఉందని, రోహిత్ శర్మ అతని గాయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడని తెలిపాడు. తొలి టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేస్తుండగా.. పంత్ గాయపడిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, October 22, 2024, 17:36 [IST]
Other articles published on Oct 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+