Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా గెలవాలంటే ఏం చేయాలంటే..?

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా వెనుకంజలో నిలిచింది. వరుసగా రెండు రోజులు ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌పై పట్టు బిగించింది. బాజ్ బాల్ బ్యాటింగ్‌తో చెలరేగి భారీ స్కోర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌కు కీలకమైన మూడో రోజుల ఆటలో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 544/7తో నిలిచిన ఇంగ్లండ్.. 186 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. దాంతో డ్రా చేసుకోవడం మినహా భారత జట్టు ముందు మరో ఆప్షన్ లేకుండా పోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ టీమిండియా విజయం సాధించవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేయాలి..

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే కొన్ని అంశాలపై ఫోకస్ పెట్టాలి. నాలుగో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేయాలి. ఆధిక్యం 200 ధాటకుండా చూసుకోవాలి. ఆ తర్వాత బ్యాటింగ్‌లో భారీ స్కోర్ నమోదు చేయాలి. బజ్ బాల్ తరహా బ్యాటింగ్‌తో 500 ప్లస్ స్కోర్ చేయాలి. అలా చేయాలంటే టీమిండియా ఓపెనర్లతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాణించడం కీలకం. ఎందుకంటే రిషభ్ పంత్ గాయంతో టీమిండియా ఒక బ్యాటర్ లేకుండా ఆడాల్సి ఉంటుంది. పంత్ రిస్క్ చేసి ఆడినా.. అతను మునపటిలా ఆడలేడు. కుంటుతూ పరుగులు చేయడం చాలా కష్టం. కాబట్టి మిగతా బ్యాటర్లే బాధ్యత తీసుకోవాలి. టాప్-5 బ్యాటర్లలో కనీసం ఇద్దరు శతకాలు నమోదు చేయాలి. ఇంగ్లండ్ తరహాలో వేగంగా ఆడాలి.

India s Blueprint for Victory in 4th Test vs England at Manchester

బౌలింగ్‌లోనూ నిప్పులు చెరగాలి..

ఇంగ్లండ్ ముందు 300-350 ప్లస్ లక్ష్యాన్ని నమోదు చేయాలి. అప్పుడు ఆ స్కోర్‌ను కాపాడుకునే బాధ్యతను బౌలర్లు స్వీకరించగలరు. వీలైనంత త్వరగా ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేస్తే భారత్ విజయం లాంఛనమవుతోంది. ఆఖరి రోజు బ్యాటింగ్ చేయడం ఏ జట్టుకైనా కష్టమే. పైగా మాంచెస్టర్ వికెట్ ఇప్పటికే స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. కాబట్టి వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా కీలకమవుతారు. లూజ్ బాల్స్ వేయకుండా సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలి. ఫీల్డింగ్‌లోనూ ఎలాంటి తప్పిదాలు చేయకూడదు. మైదానంలో భారత ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఏది ఏమైనా గెలవాలనే కసితో ఆడాలి. ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి.

Story first published: Saturday, July 26, 2025, 15:41 [IST]
Other articles published on Jul 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+