For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఆ ముగ్గురు ఔట్.. ఆ మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ! ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు టీమిండియా సిద్దమైంది. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఒకటి మాత్రమే గెలిచిన భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు అత్యంత కీలకం. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి నాలుగో టెస్ట్‌కు దూరమయ్యారు.

ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ముగ్గురు ప్రధాన ఆగాళ్లు గాయపడటంతో పాటు రిషభ్ పంత్ కూడా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటుండటంతో టీమిండియా కాంబినేషన్‌ ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంత్‌ను కేవలం బ్యాటర్‌గానే జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

India s 4th Test XI vs England Anshul Kamboj Dhruv Jurel In Kuldeep Yadav Returns

కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ..

గత మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో అవకాశం అందుకొని కుల్దీప్ యాదవ్.. నాలుగో టెస్ట్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ గాయాల నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించి ఆ లోటును భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తుది జట్టులో కొనసాగనుండగా.. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేయనున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు.

వాషింగ్టన్ సుందర్ స్థానంలో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనున్నాడు. రిషభ్ పంత్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడనున్నాడు. మిగతా బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. మూడు టెస్ట్‌ల్లో విఫలమైన కరుణ్ నాయర్‌ను తప్పించాలనుకుంటే మాత్రం సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్‌లో ఒకరు తుది జట్టులోకి రానున్నారు.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

Story first published: Monday, July 21, 2025, 12:40 [IST]
Other articles published on Jul 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+