Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Day-Night Test: తొలి డేనైట్ టెస్టు ఆడబోతోన్న భారత్.. క్రికెట్ చరిత్రలో రెండోదే!!

Indian women Team to play maiden pink-ball Test vs Australia

ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్​ ఆడబోతోంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో మిథాలీ సేన పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ విషయాన్ని భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా తెలిపారు. మహిళల క్రికెట్​ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు షా పేర్కొన్నారు. బీసీసీఐ ఇప్పటికే మహిళల ఐపీఎల్ కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రెండో గులాబి టెస్టు

'మహిళల క్రికెట్ పట్ల మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్​లో భారత మహిళలు తొలి పింక్ బాల్ టెస్టు ఆడబోతున్నారు. ఈ విషయం తెలిపేందుకు చాలా సంతోషిస్తున్నా. మహిళల క్రికెట్​ను మరింత ముందుకు తీసుకెళతాం' అని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే గులాబి టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలిసారిగా డేనైట్ టెస్టు ఆడాయి.

ఏడేళ్ల తర్వాత

ఏడేళ్ల తర్వాత

జూన్ 2న భారత పురుషులతో పాటు మహిళలు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్​లో మిథాలీ సేన టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో పాల్గొననుంది. తర్వాత టీ20, వన్డే సిరీస్​లూ జరగనున్నాయి. ఇంకా షెడ్యూల్​ ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ మధ్యలో ఈ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చివరసారిగా ఆసీస్​తో 2006లో టెస్టు మ్యాచ్ ఆడారు భారత మహిళలు.

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!!

మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు

మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు

మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్‌ టీమ్‌ మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూన్ 16-19 వరకు బ్రిస్టల్‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 27న బ్రిస్టల్ మొదటి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండవ వన్డే (డే-నైట్) జూన్ 30న టౌంటన్‌లో జరుగుతుంది. ఇక చివరిదైన మూడవ వన్డే జూన్ 3న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ జూలై 9న నార్తాంట్స్‌లో, రెండో టీ20 జూలై 11 హోవ్‌లో, మూడో టీ20 జూలై 15న చెల్మ్స్ ఫోర్డ్‌లో షెడ్యూల్ అయి ఉన్నాయి.

ఒకే చార్టర్డ్ విమానంలో

ఒకే చార్టర్డ్ విమానంలో

టీమిండియా పురుషుల మరియు మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కలిసి త్వరలోనే ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటన కోసం కోహ్లీసేన, మిథాలీ బృందం జూన్‌ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది.

పురుషులు, మహిళల క్రికెట్‌ జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే చార్టర్డ్‌ విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇలా భారత బృందం కలిసివెళ్లడానికి కరోనా వైరస్ మహమ్మారి కారణం.

Story first published: Thursday, May 20, 2021, 14:19 [IST]
Other articles published on May 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+