Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL:టీమిండియాకు శుభవార్త.. రెండో వన్డేకు అందుబాటులో శాంసన్‌! శశి థరూర్‌ ఆనందం!

Indian wicketkeeper Sanju Samson recovers from injury, He available for 2nd ODI vs Sri Lanka

కొలంబో: శ్రీలంకతో రెండో వన్డేకు ముందు టీమిండియాకు శుభవార్త. ఈరోజు ప్రేమదాస మైదానంలో జరగనున్న రెండో వన్డేకు యువ ఆటగాడు సంజు శాంసన్‌ అందుబాటులో ఉంటాడని సమాచారం. మోకాలి గాయం నుంచి శాంసన్‌ పూర్తిగా కోలుకున్నాడట. అయితే శాంసన్‌ స్థానంలో తొలి వన్డే ఆడిన ఇషాన్‌ కిషన్‌ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా? లేదో? చూడాలి.

గాయపడటం వల్లే

గాయపడటం వల్లే

శ్రీలంకతో తొలి వన్డేకు శిఖర్ ధావన్ జట్టును ప్రకటించినప్పుడు భారత అభిమానులు ఆశ్చర్యపోయారు. సంజు శాంసన్‌ను ఎందుకు ఆడించలేదని సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు. అయితే ప్రాక్టీస్ సమయంలో శాంసన్‌ గాయపడటం వల్లే.. అతడిని ఆడించలేదని తెలియడంతో ఫాన్స్ శాంతించారు. అతడి స్థానంలో జార్ఖండ్ కుర్రాడు ఇషాన్‌ కిషన్‌ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వికెట్‌ కీపింగ్‌తో పాటు దూకుడుగా బ్యాటింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. కేవలం 42 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఇందులో 8 బౌండరీలు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి.

శశి థరూర్‌ ఆనందం

శశి థరూర్‌ ఆనందం

సంజు శాంసన్‌ రెండో వన్డేకు అందుబాటులో ఉంటున్నాడని తెలియడంలో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఆనందం వ్యక్తం చేశారు. 'మోకాలి గాయం నుంచి సంజు కోలుకున్నాడని శ్రీలంక నుంచి వార్తలు అందడం సంతోషకరం. తిరువనంతపురం కుర్రాడు రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు.

ఆల్‌ ది బెస్ట్‌ సంజు' అని శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు. వీరిద్దరూ ఒకే నగరానికి చెందినవారు అన్న విషయం తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు శాంసన్‌ విషయంలో శశి థరూర్‌ స్పందించారు. 2015లో జట్టులోకి వచ్చిన సంజు.. భారత్ తరఫున ఇప్పటివరకు కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడు.

IND vs CSXI: కౌంటీ ఎలెవన్‌తో భారత్‌ మ్యాచ్‌.. కళ్లన్నీ మయాంక్‌పైనే! కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌!

అదొక్కటే ఆప్షన్

అదొక్కటే ఆప్షన్

మంచి ప్రదర్శన చేస్తున్నా.. సంజు శాంసన్‌ని తుది జట్టులోకి తీసుకోవట్లేదనే అపవాదు బీసీసీఐపై ఉంది. 2015లో భారత జట్టులోకి వచ్చిన సంజు.. ఇప్పటివరకు కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ రెండో వన్డేలో సంజుకు చోటివ్వాలనుకుంటే.. నెమ్మదిగా ఆడుతున్న మనీష్ పాండేపై వేటు పడనుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ ముందు ఇదొక్కటే ఆప్షన్ ఉంది. ధావన్ అయినా.. సంజుకు అవకాశం ఇవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్‌: శిఖర్ ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, మనీశ్‌ పాండే/సంజు శాంసన్‌, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్‌ చహర్, కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌.

Story first published: Tuesday, July 20, 2021, 12:27 [IST]
Other articles published on Jul 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+