
కళ్లన్నీ మయాంక్‌పైనే
కౌంటీ సెలెక్ట్ ఎలెవన్‌తో జరగనున్న మూడు రోజుల మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న మయాంక్.. భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో తొలి టెస్టులో రోహిత్ శర్మతో కలిసి మయాంక్ ఓపెనర్‌గా దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడి అటను జట్టు యాజమాన్యం నిశితంగా పరిశీలించనుంది. గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడికి 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది.

కీపర్‌గా కేఎల్ రాహుల్
రిషబ్ పంత్ గైర్హాజరీలో ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిన పంత్ లండన్‌లో సన్నిహితుల ఇంట్లో 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడని బీసీసీసీఐ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే వేగంగా కోలుకుంటున్న పంత్.. డర్హమ్‌లో బయో బబుల్‌లో ఇంకా చేరలేదు. బుధవారం డర్హమ్‌లో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో అతను చేరనున్నాడు. జూలై 28న ప్రారంభమయ్యే సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతను పాల్గొనే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
IRE vs SA: రాణించిన మార్‌క్రమ్.. షంసీ మాయ! తొలి టీ20లో ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా విజయం!!

జేమ్స్ బ్రేసీ మాత్రమే
'ఒకవేళ రిషబ్ పంత్ జట్టుతో చేరినా.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ అందుకోవడం కోసం అతడికి విశ్రాంతి ఇచ్చేవాళ్లు. అతడిలో లక్షణాలేమీ లేవు. కానీ నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టుకు ముందు అతడికి మంచి ట్రైనింగ్ అవసరం. పంత్, సాహా ఇద్దరూ తొలి టెస్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటారు' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.
మరోవైపు కౌంటీ ఎలెవన్ జట్టులో ఎక్కువ మంది యువకులే. ఒక్క జేమ్స్ బ్రేసీ మాత్రమే ప్రస్తుతం ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్‌లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్‌కు 15 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. వార్విక్‌షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్‌కు నాయకత్వం వహించనున్నాడు.

జట్లు
భారత్: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, విరాట్ కోహ్లీ, హనుమా విహారి, రవీంద్ర జడేజా, వృద్దిమాన్ సాహా, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఇశాంత్ శర్మ.
కౌంటీ సెలెక్ట్ XI: జాక్ చాపెల్, రాబర్ట్ యేట్స్, జేమ్స్ బ్రేసీ, హసీబ్ హమీద్, రెహన్ అహ్మద్, జేమ్స్ రివ్, విల్ రోడ్స్, జేక్ లిబ్బి, లిండన్ జేమ్స్, క్రెయిగ్ మైల్స్, లియామ్ ప్యాటర్సన్-వైట్, ఏతాన్ బాంబర్, జాక్ కార్సన్.


Click it and Unblock the Notifications












