Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కలికాలం.. అప్పుడు హయ్యెస్ట్.. ఇప్పుడు లోయెస్ట్.. పొగిడిన నోళ్లే.. నిందలేస్తున్నాయ్!

Indian Test crickets uncanny coincidence of historic day December 19

అడిలైడ్: కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు పొగిడిన నోళ్లే.. కాలక్రమంలో నిందలేస్తాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఇదే అనుభవం ఎదురైంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు విరాట్ కోహ్లీకి జేజేలు పలికిన జనం.. శనివారం పింక్‌బాల్ టెస్ట్ ముగిసిన తర్వాత తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు. 2016 డిసెంబర్ 19న కోహ్లీ కెప్టెన్సీలోని జట్టు.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించింది.

కరుణ్ నాయర్ ట్రిపుల్..

కరుణ్ నాయర్ ట్రిపుల్..

చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో కరణ్ నాయర్(303 నాటౌట్) అజేయ ట్రిపుల్.. కేఎల్ రాహుల్(199) భారీ సెంచరీతో చెలరేగడంతో భారత్ 759/7 భారీ స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 75 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే డిసెంబర్ 19న కోహ్లీ సేన.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ 36కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా చేతిలో భారీ ఓటమి మూటగట్టుకుంది.

యాదృశ్చికమో..

యాదృశ్చికమో..

‘దేశం తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ప్లేయర్లు ఎలా సిద్దమవ్వాలి, ఓ జట్టు ఎలా ఉండాలనే దానికి ఇదో ఉదాహరణ' చెన్నైలో సాధించిన విక్టరీ అనంతరం విరాట్ మాటలివి. కానీ శనివారం మాత్రం తమ ఆట గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నాడు.యాదృశ్చికంగా డిసెంబర్ 19నే నమోదైన ఈ రికార్డుల గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ నడుస్తోంది. ఈ రెండు రికార్డ్ స్కోర్లను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అంతా కలికాలం అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఫ్లాఫ్ 36..

ఫ్లాఫ్ 36..

రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్‌ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్‌లో వెనుకంజ వేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్‌ హాజల్‌వుడ్‌ (5/8), ప్యాట్‌ కమిన్స్‌ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు.

ఆడుతూ పాడుతూ..

ఆడుతూ పాడుతూ..

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్‌ ఓవరాల్‌ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది. జో బర్న్స్‌ (63 బంతుల్లో 51 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్‌ (53 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 5 చక్కటి క్యాచ్‌లు అందుకున్న కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. ఆసీస్‌ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు జరుగుతుంది.

Story first published: Sunday, December 20, 2020, 10:41 [IST]
Other articles published on Dec 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+