T20 World Cup 2022: టీమిండియాను వెంటాడుతున్న ఓపెనర్ల వైఫల్యం.. సఫారీ ట్రాప్‌లో పడ్డ రోహిత్, రాహుల్!

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ల వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓపెనర్లు జట్టుకు కావాల్సిన శుభారంభం అందించలేకపోయారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు 26 పరుగులకే వెనుదిరిగారు. మూడు బంతుల వ్యవధిలోనే ఈ ఇద్దరు ఔటయ్యారు. లుంగి ఎంగిడితో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రచించిన వ్యూహంలో చిక్కుకున్నారు. ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో రెండో బంతికి రోహిత్ శర్మ(15) రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. చివరి బంతికి రాహుల్(9) స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగారు.

ఎంగిడి ట్రాప్‌లో రోహిత్, రాహుల్..
రోహిత్ శర్మను బలహీనతను టార్గెట్ చేస్తూ లుంగి ఎంగిడి షార్ట్ బాల్‌తో రోహిత్‌ను టెంప్ట్ చేయగా.. మిస్ టైమ్ అయిన బంతి అక్కడే గాల్లోకి లేచింది. దాంతో ఎంగిడి సునాయస క్యాచ్ అందుకొని రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆ తర్వాత ఫుట్‌వర్క్ లోపంతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌ను బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌తో లుంగి ఎంగిడి బోల్తా కొట్టించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని రాహుల్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ ఫీల్డర్ మార్కర్‌మ్ చేతిలో పడింది. వ్యూహాత్మకంగానే ఎంగిడి స్లిప్ ఫీల్డర్ పెట్టి ఈ బంతిని వేయగా.. రాహుల్ అతని ట్రాప్‌లో పడ్డాడు.

శుభారంభం లేదు..
ఈ టోర్నీలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో టీమిండియాకు సరైన శుభారంభం దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్, రోహిత్ ఆదిలోనే ఔటయ్యారు. నెదర్లాండ్స్‌తో రోహిత్ రాణించినా.. రాహుల్ ఆదిలోనే వెనుదిరిగాడు. పాక్‌తో తొలి వికెట్‌కు 7 పరుగులు జోడించిన రోహిత్-రాహుల్.. నెదర్లాండ్స్‌తో తొలి వికెట్‌కు 11 పరుగులు మాత్రమే జోడించారు. తాజా మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 23 పరుగులు చేశారు.

పవర్ ప్లేలో దారుణం..
ఓపెనర్ల వైఫల్యం కారణంగా టీ20ల్లో కీలకమైన పవర్ ప్లేలో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోతుంది. ఇప్పటి వరకు రోహిత్ సేన పవర్ ప్లేలో కనీసం 6 రన్ రేట్ నమోదు చేయలేకపోయింది. పవర్ ప్లేలో పాకిస్థాన్‌తో 31/3 , నెదర్లాండ్స్‌తో 32/1, సౌతాఫ్రికాతో 33/2 పరుగులు మాత్రమే చేసింది. ఈ పవర్ ప్లే గణంకాలు టీమిండియాను కలవరపెడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవాలంటే ఓపెనర్లు రాణించడం చాలా కీలకం. ఇదే తరహా ఆటతీరుతో సెమీస్‌లో గెలవడం చాలా కష్టం.

కష్టాల్లో భారత్..
సౌతాఫ్రికాతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లతో పాటు అపద్భాందవుడనుకున్న విరాట్ కోహ్లీ(12)తో పాటు దీపక్ హుడా(0), హార్దిక్ పాండ్యా(2) దారుణంగా విఫలమయ్యారు. ఎంగిడి షార్ట్ పిచ్ బాల్ వ్యూహాన్ని కోహ్లీ పసిగట్టలేకపోయాడు. ఊరించే బంతులతో కోహ్లీని టెంప్ట్ చేసి భారీ షాట్ ఆడేలా చేశాడు. భారత బ్యాటర్లకు అనుగుణంగా పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో బరిలోకి దిగిన సఫారీ.. వాటిని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసింది. దాంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications