For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: గాయంతో వరుణ్ చక్రవర్తీ ఔట్.. కోహ్లీ బౌలర్‌కు చాన్స్!

Indian T20 World Cup Squad 2021: Will Varun Chakravarthy Be Replaced By Harshal Patel

హైదరాబాద్: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్‌లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడుతున్న వరుణ్‌ చక్రవర్తి.. మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో మెగాటోర్నీలో అతను అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌ లేమితో బాధపడుతున్న వరుణ్‌ స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం అతని గాయాన్ని బోర్డు పర్యవేక్షిస్తుందని, కోల్‌కతా మేనేజ్‌మెంట్‌ నుంచి ఎప్పటికప్పుడు ఆరాతీస్తుందని సమాచారం.

హర్షల్ పటేల్‌కు చాన్స్..

హర్షల్ పటేల్‌కు చాన్స్..

అయితే గాయంతో బాధపడుతున్న వరుణ్ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌ను తీసుకోవాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫస్టాఫ్‌లో దుమ్మురేపిన హర్షల్.. యూఏఈ వేదికగా జరుగుతున్న సెకండాఫ్‌లోనూ అదరగొట్టాడు. ప్రస్తుతం టోర్నీలో 13 మ్యాచ్‌లు ఆడిన హర్షల్ 29 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కానసాగుతున్నాడు. దాంతో అతన్ని అంతా ముద్దుగా పర్పుల్ పటేల్ అని పిలుస్తున్నారు. ఇక హర్షల్ లోయరార్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు.

కోహ్లీ అండ..

కోహ్లీ అండ..

అంతేకాకుండా యూఏఈ పిచ్‌లకు అనుగుణంగా అతను స్లోయర్, నకుల్ బాల్స్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని భారత జట్టులోకి తీసుకుంటే కలిసి వస్తుందని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న అతను మెగా టోర్నీలో కూడా అదే జోరు చూపించగలడని కోహ్లీ భావిస్తున్నట్లు సమాచారం. సెలెక్టర్ల ముందు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

తొలి భారత్‌ బౌలర్‌గా..

తొలి భారత్‌ బౌలర్‌గా..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన హర్షల్ పటేల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు హర్షల్‌ పటేల్ ఐపీఎల్ 2021లో 13 మ్యాచులు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు.

దాంతో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా ఐపీఎల్ 2020 సీజన్లో 15 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో భువీ 14 మ్యాచులలో 26 వికెట్లు తీశాడు.

ఓవరాల్‌గా మూడో బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో(2013 సీజన్‌లో 32 వికెట్లు), కగిసో రబడా(2020 సీజన్‌లో 30 వికెట్లు)‌ హర్షల్ కన్నా ముందున్నారు. ఈ సీజన్‌లో బ్రావో రికార్డును సైతం హర్షల్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.

పెయిన్ కిల్లర్స్ లేకుండా..

పెయిన్ కిల్లర్స్ లేకుండా..

ఇక కోల్‌కతా తరఫున 13 మ్యాచ్‌లాడిన వరుణ్ చక్రవర్తీ.. 15 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తనదైన బౌలింగ్‌లో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. అయితే వరల్డ్ కప్ టీమ్‌లో వరుణ్ చక్రవర్తి కొనసాగినా.. ఫిట్‌నెస్ లేకపోతే అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం అతని గాయం చాలా తీవ్రంగా ఉందని, పెయిన్ కిల్లర్స్ లేకుండా కనీసం బౌలింగ్ కూడా చేయలేకపోతున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న వరుణ్‌ను పక్కనపెట్టడమే ఉత్తమమని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారట. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి అనుహ్యంగా గాయంతో ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహా దుస్థితిని ఎదుర్కొంటున్నాడు.

Story first published: Thursday, October 7, 2021, 17:23 [IST]
Other articles published on Oct 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+