
కలవరపెడుతున్న కోహ్లీ వైఫల్యం..
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన విరాట్ .. 41,12, 5, 48, 1, 12, 0, 0 లతో 119 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ చేయకపోగా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడు లేని విధంగా కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు అతని పేలవ ప్రదర్శన వారిని ఆందోళనకు గురి చేస్తోంది. టీ20 ప్రపంచకప్ సమయానికి అతను టచ్‌లోకి వస్తే ఏం కాదు లేకుంటే టీమిండియాకు తీవ్ర కష్టాలు తప్పవు.

సన్నగిల్లనున్న రోహిత్ ఆత్మవిశ్వాసం..
టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత వరుస విజయాలు నమోదు చేసిన రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2022 సీజన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. దాంతో ముంబై ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 8 మ్యాచ్‌లు ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఏ ఐపీఎల్ ప్రదర్శన ద్వారా అయితే టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడో.. మళ్లీ అదే టోర్నీ పేలవ ప్రదర్శనతో రోహిత్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ వరుస పరాజయాలు అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఈ వరుస పరాజయాలు టీమిండియా కెప్టెన్‌గా అతనిపై ప్రభావం చూపనున్నాయి.

సూర్య, జడేజా, పంత్ కూడా..
ఇక టీమిండియాలో కీలకమైన రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్‌లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికైన రవీంద్ర జడేజా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్ ముందుకు వరకు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సూపర్ ఫామ్‌లో కనబడిన జడేజా.. కెప్టెన్సీ ఒత్తిడితో తేలిపోతున్నాడు. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్‌లో తన మార్క్ చూపించలేకపోతున్నాడు. సూర్యకుమార్ కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా ఆ తర్వాత తేలిపోయాడు. రిషభ్ పంత్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు.

రాణిస్తున్న రాహుల్, హార్దిక్, చాహల్..
టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్‌లు రాణిస్తున్నారు. రాహుల్ ఇప్పటికే రెండు సెంచరీలు బాదగా.. హార్దిక్ పాండ్యా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే ప్రదర్శన కనబరుస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్‌గా సత్తాచాటుతున్నాడు. యుజ్వేంద్ర చాహల్ సైతం బంతితో చెలరేగుతున్నాడు. సూపర్ ఫామ్‌లోకి వచ్చిన అతను ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా వికెట్లు తీయలేకపోతున్నా.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పర్వాలేదనిపిస్తున్నాడు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు సంచలన ప్రదర్శనతో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు.

టీమిండియా టీ20 ప్రపంచకప్ టీమ్(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్/ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్/దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా/వెంకటేశ్ అయ్యర్, టీ నటరాజన్/భువనేశ్వర్, హర్షల్ పటేల్/ఉమ్రాన్ మాలిక్, జస్‌ప్రీత్ బుమ్రా/మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications
