For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: కేఎల్ రాహుల్ ఇన్.. భువనేశ్వ కుమార్ డౌట్! భారత టీ20 ప్రపంచకప్ జంబో జట్టు ఇదే!

 Indian Squad For T20 World Cup To Be Announced Soon: KL Rahul In And Bhuvneshwar Kumar Doubt
T20 World Cup 2021 : Team India జంబో జట్టు... మరి అసలు Squad లో ఉండేది ఎవరో ? || Oneindia Telugu

ముంబై: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే ఈ మెగా టోర్నీ సందడి మొదలైంది. భారత్ వేదికగా జరగాల్సిన ఈ పొట్టి ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈకి తరలిపోయింది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఓమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లకు ఓమన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ప్రధాన మ్యాచ్‌లు అరబ్ గడ్డపై జరగనున్నాయి.

 20 మందితో జంబో టీమ్..

20 మందితో జంబో టీమ్..

'ఇప్పటికే జట్టు ఎంపిక పూర్తైంది. నాలుగో టెస్టు ఫలితం త్వరగా తేలితే సోమవారం సాయంత్రమే జట్టును ప్రకటిస్తారు. ఆలస్యమైతే మంగళవారం ఉదయం ప్రకటిస్తారు. ఎవరెవరిని ఎంపిక చేయాలి? ఏ స్థానాల్లో ఎవరిని ఆడించాలన్న అంశాలపై నాలుగో టెస్టుకు ముందే కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది.'అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. ఐసీసీ 15 మందికే రీయింబర్స్‌ చేస్తున్నా.. బీసీసీఐ మాత్రం అదనంగా మరో ఐదుగురిని ఎంపిక చేయనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్త పడుతోంది. ఐపీఎల్‌ బుడగ నుంచి ప్రపంచకప్‌ బుడగకు వీరంతా బదిలీ అవుతారు. ఇంగ్లండ్‌, శ్రీలంక పర్యటనలకూ బీసీసీఐ జంబో జట్లనే ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అందరికీ చాన్స్..

అందరికీ చాన్స్..

15 మంది సభ్యుల ప్రధాన టీమ్‌లో కీలక ఆటగాళ్లకు అవకాశం దక్కినా.. అదనంగా ఐదుగురిని ఎంపిక చేస్తుండటం, రిజర్వ్ ప్లేయర్లుగా మరో నలుగురికి అవకాశం ఉండటంతో దాదాపు టీమ్‌లోని ప్రధాన ఆటగాళ్లందరికి అవకాశం దక్కనుంది. అయితే ప్రధాన టీమ్‌లో ఎవరుంటారా? అనే ఆసక్తి అందరిలోనెలకొంది. అయితే దీపక్ చాహర్ మంచి ఫామ్‌లో ఉండటం, అతనికి బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో భువనేశ్వర్ కుమార్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాకప్‌గా కేఎల్ రాహుల్‌కు చోటు ఖాయమైంది.

పాకిస్థాన్‌తో ఫస్ట్ మ్యాచ్..

పాకిస్థాన్‌తో ఫస్ట్ మ్యాచ్..

గ్రూప్ 2లో ఉన్న భారత్, పాకిస్థాన్.. అక్టోబ‌ర్ 24న దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ వేటను ప్రారంభించనున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మళ్లీ తలపడుతుండటం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్-పాక్ ఇప్పటి వరకు 5 సార్లు తలపడగా భారత్ ఒక్కసారి కూడా ఓడలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో నేరుగా విజయాలందుకోగా.. 2007 టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో బౌలౌట్ విధానంలో గెలుపొందింది. అదే టోర్నీ ఫైనల్లోనూ పాకిస్థాన్‌ను చిత్తు చేసి తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.

భారత జంబో టీమ్..

భారత జంబో టీమ్..

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, పృథ్వీ షా, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

Story first published: Monday, September 6, 2021, 14:03 [IST]
Other articles published on Sep 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+