
శిఖర్ ధావన్ ఔట్..
భారత జట్టులో ఒక ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఆడటం ఖాయం. మరో ఓపెనర్ ఎవరా? అనేదానిపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎక్స్‌ట్రా బౌలర్‌ను ఆడించే వ్యూహంలో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఓపెనింగ్ చేస్తానని ప్రకటించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున ఓపెనర్‌గా కూడా బరిలోకి దిగాడు. బ్యాకప్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ జట్టులో ఉండటం ఖాయం. అవసరమైతే అతని సేవలను మిడిలార్డర్‌లో కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా రిషభ్ పంత్‌కు బ్యాకప్ కీపర్‌గా కూడా రాహుల్ ఉండనున్నాడు. ఈ క్రమంలో అతను భారత జట్టులో ఉండటం ఖాయం. ఇటీవల ఫామ్‌లో ఉన్న పృథ్వీషా, మరో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌లకు చోటు దక్కడం కష్టమే అనిపిస్తుంది. అయితే మెగాటోర్నీల్లో ధావన్ ఫామ్ అద్భుతంగా ఉంది. పైగా భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో అతను సత్తా చాటాడు. యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ లీగ్‌లోనూ అతను సంచలన ప్రదర్శన కనబరిస్తే జట్టులోకి రావచ్చు. పృథ్వీ షా పరిస్థితి కూడా ఇదే. యూఏఈలో రాణించకుంటే ఈ ఇద్దరికి టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం దూరమైనట్టే.

సూర్యకుమార్‌కు చాన్స్..
పరిమిత ఓవర్ల సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కడం ఖాయం. కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగితే సూర్య ఫస్ట్‌డౌన్‌లో ఆడనున్నాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనున్నారు. అలా కాకుండా కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో దిగితే సూర్య నాలుగో ప్లేస్‌లో ఆడుతాడు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక బ్యాటింగ్ శైలి కలిగిన సూర్యకు జట్టులో చోటు దక్కడం ఖాయం. ఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ చోటు డోకా లేదు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వస్తాడు. అయితే గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా సందర్భానుసారం మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడు. ఇది టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పైగా ఇటీవల పాండ్యా ఫామ్ మరి దారుణంగా ఉంది. శ్రీలంక పర్యటనలో అతను ఘోరంగా విఫలమయ్యాడు. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ అతనికి లిట్మస్ టెస్ట్‌లాంటిది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి ఫామ్ అందుకుంటేనే అతనికి చోటు దక్కుతుంది.

స్పిన్నర్ల మధ్య తీవ్ర పోటీ..
ఇక స్పిన్నర్ల కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.. చాహల్ ఫామ్‌లోకి రావడంతో అతనికి చోటు ఖాయం. స్పిన్ ఆల్‌రౌండర్‌గా జడేజా చోటుకు డోకాలేదు. జట్టులో మరో ఆల్‌రౌండర్ కావాలని భావిస్తే వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యాలో ఇద్దరికి చోటు దక్కవచ్చు. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్‌లో సత్తా చాటితే వరుణ్ చక్రవర్తీకి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక కుల్దీప్ యాదవ్ దారులన్నీ మూసుకుపోయాయి. రాహుల్ చాహర్‌ను కూడా పక్కనపెట్టలేం. అనుభవం కలిగిన యుజ్వేంద్ర చాహల్‌తో పాటు బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న అక్షర్, కృనాల్, వాషింగ్టన్ సుందర్‌కు ఎక్కువ ప్రాధాన్యత లభించవచ్చు.

పేసర్లుగా బుమ్రా, భువీ..
భారత ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉండటం ఖాయం. ఇక ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలను కూడా పక్కనపెట్టలేం. అయితే ఐపీఎల్‌లో వీరు కనబర్చే ప్రదర్శనపైనే వీరి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక టీమిండియా యార్కర్ల సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్ సైతం ఈ రేసులో ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ ఫస్టాఫ్‌కు దూరమైన నటరాజన్.. ప్రస్తుతం కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. గత సీజన్ మాదిరి తనదైన యార్కర్లతో నట్టూ చెలరేగితే భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు (అంచనా)
1.రోహిత్ శర్మ 2. కేఎల్ రాహుల్ 3. విరాట్ కోహ్లీ(కెప్టెన్) 4. సూర్యకుమార్ యాదవ్ 5. రిషభ్ పంత్ 6. హార్దిక్ పాండ్యా 7. రవీంద్ర జడేజా 8. యుజ్వేంద్ర చాహల్ 9. భువనేశ్వర్ కుమార్ 10. దీపక్ చాహర్ 11. జస్‌ప్రీత్ బుమ్రా 12. శార్దూల్ ఠాకూర్ 13. వాషింగ్టన్ సుందర్ 14. ఇషాన్ కిషన్ 15. కృనాల్ పాండ్యా/రాహుల్ చాహర్


Click it and Unblock the Notifications
