Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. అన్నీ మూసుకొని భారత్‌కు వస్తారు! రమీజ్ రాజా వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్!

Indian Sports Minister Anurag Thakurs brutal reply to Ramiz Rajas explosive remark

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు రాకుంటే.. తమ జట్టు భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ‌ఆడబోదని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాక్ బెదిరింపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వాళ్లే అన్ని మూసుకొని భారత్‌కు వస్తారని బదులిచ్చారు. ఇక ఆసియా కప్ 2023 టోర్నీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య చిచ్చు రేపింది. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో అడుగుపెట్టేది లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేయడంతో ఇరుదే శాల బోర్డుల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.

ప్రపంచకప్ ఎవరూ చూస్తారు..?

ప్రపంచకప్ ఎవరూ చూస్తారు..?

తాజాగా ఇదే అంశాన్ని మీడియా పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ముందు ఉంచగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ కోసం భారత జట్టు, పాకిస్థాన్‌కు రాకపోతే పాక్ జట్టు... భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడదని పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కామెంట్ చేశాడు. అంతేకాకుండా పాక్ జట్టు లేకుండా రాకపోతే వరల్డ్ కప్ మ్యాచులు ఎవరు చూస్తారని వ్యాఖ్యనించాడు. ఈ కామెంట్స్‌పై స్పందించిన అనురాగ్ ఠాకూర్ వారికి అంత సీన్ లేదన్నాడు.

భారత్‌‌దే ఆధిపత్యం..

భారత్‌‌దే ఆధిపత్యం..

'సరైన సమయం కోసం వేచి చూడండి. వరల్డ్ క్రికెట్‌లో భారత్ ఓ అత్యున్నత శక్తి. భారత్‌ను ఏ దేశం కూడా డామినేట్ చేయలేదు. మేం పాకిస్థాన్‌కు వెళ్లబోం. కానీ వాళ్లు వన్డే వరల్డ్ కప్ కోసం ఇక్కడికి వచ్చి తీరతారు. కావాలంటే రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది.'అని అనురాగ్ ఠాకూర్ బదులిచ్చాడు. అనురాగ్ ఠాకూర్ గతంలో బీసీసీఐ అధ్యక్షునిగా, ఐసీసీ చైర్మన్‌గా కూడా పనిచేశాడు.

పాక్‌కే నష్టం..

పాక్‌కే నష్టం..

భారత జట్టు, పాకిస్థాన్‌కు వెళ్లకపోతే ఆసియా కప్ 2023 టోర్నీకి క్రేజ్ పూర్తిగా పోతుంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, కొన్ని వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే పాకిస్థాన్, వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌కు రాకపోతే కూడా పీసీబీకే నష్టం జరుగుతుంది. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా వచ్చే కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ ఆదాయం, బీసీసీఐ కోల్పోవాల్సి ఉంటుంది.

భారత్‌ను రెండు సార్లు ఓడించాం

భారత్‌ను రెండు సార్లు ఓడించాం

ఏడాది కాలంలో భారత్‌ను రెండు సార్లు ఓడించామని, పాక్ పటిష్టంగా మారిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని కూడా రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. '2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాని ఓడించాం... ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా భారత జట్టును చిత్తు చేశాం. ఒకే ఏడాది గ్యాప్‌లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్, బిలియన్ డాలర్ ఎకానమీ టీమ్‌ని రెండు సార్లు ఓడించింది. పాక్ పటిష్టంగా మారిందని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది. పాక్ జట్టు పాల్గొనని వన్డే ప్రపంచకప్‌ను ఎవరు చూడరు.'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, November 27, 2022, 17:15 [IST]
Other articles published on Nov 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+