For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs India: ఇషాంత్ స్థానంలో సిరాజ్.. మరోసారి ఆ పొర‌పాటు చేయ‌కూడ‌ద‌నే!!

Indian pacer Mohammed Siraj to replace Ishant Sharma In Tests vs England
Ind Vs Eng : Mohammed Siraj పై Teamindia ఫోకస్, Kohli ఉండనే ఉన్నాడు..!! || Oneindia Telugu

లండ‌న్‌: గత నెలలో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. ముఖ్యంగా పేస్ బౌలర్లు తేలిపోవడంతోనే మ్యాచ్ భారత్ చేజారింది. సీనియర్ బౌలర్‌గా భారత బౌలింగ్‌ విభాగంను ముందుండి నడిపించాల్సిన ఇషాంత్ శర్మ.. పేస్ పిచ్‌పై కూడా తేలిపోయాడు. మూడు వికెట్లు పడగొట్టినా అది చెప్పుకోదగ్గ ప్రదర్శన మాత్రం కాదు.

దీంతో ఫైన‌ల్లో హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్ జట్టులో ఉండి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని మ్యాచ్ త‌ర్వాత విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ మరోసారి ఆ పొర‌పాటు చేయ‌కూడ‌ద‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లుంది. అందుకే తుది జ‌ట్టులో ఇషాంత్ స్థానంలో సిరాజ్‌ను తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

5 టెస్టుల్లో 16 వికెట్లు

5 టెస్టుల్లో 16 వికెట్లు

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా టూర్‌లో త‌న టెస్ట్ కెరీర్ ప్రారంభించిన హైదరాబాద్ గల్లీ బాయ్ మొహ్మద్ సిరాజ్‌.. త‌న బౌలింగ్‌తో మాయ చేశాడు. టెస్ట్ సిరీసుకు ముందు తన తండ్రి మరణించినా.. ఆ బాధను దిగమింగుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి.. సిరీస్‌లో భారత్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు.

బ్రిస్బేన్‌లో జ‌రిగిన చివరి టెస్ట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల‌తో చారిత్ర‌క విజ‌యం సాధించింది. సీనియర్ పేసర్లు లేని లోటును టీమిండియాకు తెలియనీయలేదు. సిరాజ్ ఇప్ప‌టి వ‌ర‌కూ 5 టెస్టులాడి 16 వికెట్లు తీశాడు.

ఇషాంత్ స్థానంలో సిరాజ్‌

ఇషాంత్ స్థానంలో సిరాజ్‌

100 టెస్టుల అనుభ‌వం ఉన్నా.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో రాణించిన ఇషాంత్ శర్మను మాజీలు విమర్శించారు. ఇషాంత్‌ ఇప్పటికీ కొత్త కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని, అతడి బౌలింగ్‌ను పరిశీలిస్తే 100 టెస్టులు ఆడిన అనుభవం కనిపించడం లేదని చురకలు వేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ మరోసారి పొర‌పాటు చేయ‌కూడ‌ద‌ని టీమ్ మేనేజ్‌మెంట్ బావిస్తోంది.

అందుకే ఇషాంత్ స్థానంలో సిరాజ్‌ను తీసుకోనుందట. ఒక‌వేళ తుది జ‌ట్టులో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జ‌డేజా ఇద్ద‌రూ ఉన్నా కూడా ఇషాంత్‌ను సిరాజ్‌తో రీప్లేస్ చేసే అవ‌కాశం ఉందని మేనేజ్‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Happy Birthday Sourav Ganguly: గంగూలీ కోసం.. RRR పోస్టర్‌‌ని వాడేసిన వీరేంద్ర సెహ్వాగ్!!

ఐపీఎల్ 2020 టర్కింగ్ పాయింట్

ఐపీఎల్ 2020 టర్కింగ్ పాయింట్

ఐపీఎల్ 2020లో సత్తాచాటడంతో (4-2-8-3) మొహ్మద్ సిరాజ్ ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. కంగారో గడ్డపై కట్టుదిట్టమైన బంతులు వేసిన సిరాజ్‌‌ మొత్తంగా 13 వికెట్లు తీశాడు. రెండు, మూడో మ్యాచులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సలహాలు పొందిన హైదరాబాద్ పేసర్.. నాలుగో టెస్టులో ఏకంగా బౌలింగ్‌ దాడికే నేతృత్వం వహించాడు.

సీనియర్లు గాయాల బారిన పడటంతో శార్దూల్‌ ఠాకూర్‌, టీ నటరాజన్‌, నవదీప్ సైనీకి అండగా నిలిచాడు. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా రాణించాడు. ఆ ఫామ్‌ను ఐపీఎల్ 2021 సీజన్‌లోను కొనసాగించాడు. తన శైలికి భిన్నంగా యార్కర్లు, వైడ్ యార్కర్లతో పొదుపుగా బౌలింగ్ చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు ధారళంగా పరుగులిచ్చి జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్.. ఈ సీజన్‌లో సూపర్ బౌలింగ్‌‌తో పేస్ విభాగాన్ని ముందుండి నడిపించాడు.

Story first published: Thursday, July 8, 2021, 16:12 [IST]
Other articles published on Jul 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+