టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించారు. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ గడ్డపై 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు ఈ ఫీట్ సాధించారు.
చివరిసారిగా 2004లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా 123 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మళ్లీ ఏ భారత ఓపెనింగ్ జోడీ ఈ ఘనతను అందుకోలేదు.

అగ్రస్థానం దిశగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్..
ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, క్రిష్ శ్రీకాంత్ 191 పరుగుల భాగస్వామ్యంతో అగ్రస్థానంలో ఉన్నారు. 1986లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ దిగ్గజ ఓపెనింగ్ జోడీ ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత చౌహన్, సునీల్ గవాస్కర్ 165 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. 1981లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మూడో ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించారు.
2003లో ఆకాశ్ చోప్రా వీరేంద్ర సెహ్వాగ్ .. మెల్‌బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 1948లో మన్కడ్, సర్వటే మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులు జోడించారు. 2004లో సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా 123 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.
అయితే జైస్వాల్, కేఎల్ రాహుల్ 131 పరుగుల అజేయ భాగస్వామ్యంతో పాత రికార్డులను అధిగమించే దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు.
భారత్‌కు భారీ ఆధిక్యం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హర్షిత్ రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీసారు.
దాంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ స్వల్ప లీడ్‌తో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిలకడగా ఆడుతోంది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.