Harbhajan Singh Retirement: ఆటకు భజ్జీ అల్విదా.. అన్నిరకాల క్రికెట్‌కు గుడ్ బై!

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆటకు అల్విదా ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని శుక్రవారం తన యూట్యూబ్ చానెల్ వేదికగా తెలియజేశాడు. తన 23 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మరిచిపోలేని అనుభూతులు పొందానని, దానికి కారణమైన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ వీడియో లింక్‌ను ట్వీట్ చేశాడు.
'ప్రతి మంచి పనికి ముగింపు అనేది ఉంటుంది. జీవితంలో నాకు అన్నీ అందించిన క్రికెట్‌కు ఈ రోజు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను చిరస్మరణీయంగా, మదురంగా మార్చిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా'అని పేర్కొన్నాడు.
భారత్ తరఫున 103 టెస్ట్‌లు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడిన హర్భజన్ సింగ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో 417 వికెట్లు తీశాడు. వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన భజ్జీ.. 150 వికెట్లు పడగొట్టాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 3,500కుపైగా పరుగులు సాధించాడు. అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన వారిలో హర్భజన్ (417) నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక భారత్ గెలిచిన 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలో హర్భజన్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్‌గా ఐపీఎల్ టైటిల్ కూడా అందుకున్నాడు. 1998లో అరంగేట్రం చేసిన భజ్జీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2016లో ఆడేశాడు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమైన భజ్జీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతనికి తుది జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications