For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Indian ODI Squad For South Africa: ధావన్ ఔట్.. వెంకటేశ్ ఇన్! సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టు ఇదే!

Indian ODI Squad For South Africa Tour 2021: Shikhar Dhawan Out And Venkatesh Iyer In

Indian ODI Squad For South Africa Tour 2021: టీమిండియా సౌతాఫ్రికా పర్యటన డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు మూడు టెస్ట్‌లు ఆడనుండగా.. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన టెస్ట్ టీమ్‌ను ప్రకటించిన సెలెక్షన్ కమిటీ.. వన్డే టీమ్ ఎంపికపై దృష్టిసారించింది. 18 మంది సభ్యులతో కూడిన టెస్ట్ టీమ్ వివరాలను వెల్లడించిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని భావించిన బీసీసీఐ పెద్దలు.. విరాట్ కోహ్లీ అంగీకరించకున్నా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రోహిత్ శర్మనే వన్డే కెప్టెన్సీ కోసం పట్టుబట్టాడనే వార్తలు వస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ ఈ వ్యవహారం భారత క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అశ్విన్‌కు చాన్స్..

అశ్విన్‌కు చాన్స్..

ఇప్పటికే టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. న్యూజిలాండ్‌తో తన ఫస్ట్ అసైన్‌మెంట్‌లో దుమ్ములేపాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనలోని వన్డేల్లోనూ అదే జోరు కనబర్చాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో భారత వన్డే జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ వన్డే పగ్గాలు అందుకోవడంతో టీమ్ ఎంపికపై అతని మార్క్ ఉండనుంది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. వన్డేలు ఆడటం ఖాయమనిపిస్తోంది. పైగా స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ గాయాలతో సతమతమవడంతో అతనికి లైన్ క్లియరైంది.

శిఖర్ ధావన్ ఔట్..

శిఖర్ ధావన్ ఔట్..

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన ధవన్.. వన్డేల్లో కూడా ఉద్వాసనకు గురికానున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తుండటం... 2023 వన్డే ప్రపంచకపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్దం చేసుకున్న నేపథ్యంలో ఏజ్‌బార్ అయిన ధావన్ ఆడించడం అనవసరమే భావనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉంది. బ్యాకప్ ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకోనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ ప్రతీష్మాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ బాదాడు. కాబట్టి అతనికి అవకాశం రావడం ఖాయమనిపిస్తోంది.

హార్దిక్ ఔట్.. అయ్యర్ ఇన్..

హార్దిక్ ఔట్.. అయ్యర్ ఇన్..

ఇక సౌతాఫ్రికా పర్యటనకు తనను పక్కనపెట్టాలని స్వయంగా బీసీసీఐని కోరిన హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. టీ20 ప్రపంచకప్ ఘోర వైఫల్యం అనంతరం భారత జట్టులో చోటు కోల్పోయిన హార్దిక్.. మళ్లీ జట్టులోకి రావాలనే కసితో రగిలిపోతున్నాడు. ఆ క్రమంలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టిసారించాడు. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్‌ను జట్టులో కొనసాగించడం అనవసరమని భావించిన బీసీసీఐ, టీమ్‌మేనేజ్‌మెంట్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో సత్తాచాటిన వెంకటేశ్ అయ్యర్‌ను అతనికి ప్రత్యామ్నాయంగా సిద్దం చేయాలనుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసి.. భారత్ తరఫున పొట్టి క్రికెట్‌లోకి అరంగేట్రం చేయించింది. సౌతాఫ్రికా పర్యటనతో వన్డే క్రికెట్‌లోనూ అవకాశం ఇవ్వాలనుకుంటుంది. విజయ్ హజారే ట్రోఫీలో అయ్యార్ పరుగుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో 348 పరుగులు చేసి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది.

హర్షల్ పటేల్‌కు చాన్స్..

హర్షల్ పటేల్‌కు చాన్స్..

ఐపీఎల్ 2021 సీజన్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన హర్షల్ పటేల్‌కు అవకాశం దక్కనుంది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హర్షల్.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డేల్లో కూడా ఆడనున్నాడు. న్యూజిలాండ్‌తో వచ్చిన అవకాశాన్ని అందుకున్న అతను అద్భుత బౌలింగ్‌తో మెప్పించాడు. దీపక్ చాహర్‌, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, షమీ, బుమ్రాలకు కూడా చోటు దక్కనుంది. అయితే వన్డే సిరీస్‌కు కూడా 18 మంది సభ్యులతో కూడిన జట్టునే ఎంపిక చేయనున్నారు. టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యాక ఈ టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

భారత వన్డే జట్టు( అంచనా)

భారత వన్డే జట్టు( అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్

Story first published: Sunday, December 12, 2021, 15:55 [IST]
Other articles published on Dec 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+