బ్యాక్ బోన్ వైఫల్యం..
ఇది టీమ్ విజయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గతేడాదిగా ఈ సమస్య ఎక్కువైంది. టాపార్డర్ శుభారంభాలు.. లోయరార్డర్ స్పూర్తిదాయకమైన ఇన్నింగ్స్‌లతో గటెక్కుతూ వచ్చిన భారత్.. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్లోఈ ముగ్గురి వైఫల్యంతోనే ఓటమికి తలవంచింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది.
ఇప్పటికే ఈ సిరీస్‌లో ముగ్గరు ప్లేయర్లు రెండేసి ఇన్నింగ్స్‌లు ఆడగా ఒక్కరూ రాణించలేకపోయారు. కోహ్లీ ఒక్కడే తాజా మ్యాచ్‌లో 42 పరుగులు చేసి రిథమ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ తన స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఇక పుజారా 9, 12 నాటౌట్, 4తో దారుణంగా విఫలమవ్వగా.. రహానే 5, 1 తీవ్రంగా నిరాశ పరిచాడు.

ఒక్కరూ రాణించలేదు..
2020 నుంచి ఈ ముగ్గురి టెస్ట్ కెరీర్ గణంకాలు పరిశీలిస్తే వీరి తడబాటు సులువుగా అర్థమవుతోంది. గతేడాదిగా ఈ ముగ్గురిలో రహానే ఒక్కడే సెంచరీ చేశాడు. అది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన మెల్‌బోర్న్ టెస్ట్‌లో. ఆ తర్వాత రహానే చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో 49 పరుగులతో పెవిలియన్ చేరాడు.
పుజారా 13 మ్యాచ్‌లు, 23 ఇన్నింగ్స్‌ల్లో 25.09 సగటుతో 552 రన్స్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలున్నాయి. విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌లు, 16 ఇన్నింగ్స్‌ల్లో 24.19 సగటుతో 387 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇక రహానే 13 మ్యాచ్‌లు, 12 ఇన్నింగ్స్‌ల్లో 25.76 సగటుతో 541 రన్స్ ఉన్నాయి. ఇందులో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉంది.

పుజారా కష్టమే..
ఈ గణంకాలే వారి పేలవ బ్యాటింగ్ తీరును తెలియజేస్తున్నాయి. క్రీజులో విరాట్ కోహ్లీ ఎలాంటి తడబాటు లేకుండా కనిపిస్తున్నా.. చతేశ్వర్ పుజారా, రహానే తీవ్రంగా తడబడుతున్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
ఈ తరహా ప్రదర్శన రెండో ఇన్నింగ్స్‌లో కూడా కొనసాగిస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటు పడటం ఖాయం. వైస్ కెప్టెన్సీ హోదా రహానేను బతికించినా పుజారా తప్పుకోవడం అనివార్యమవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, సెంచరీనో లేక స్పూర్తిదాయకమైన పోరాటం చేస్తే తప్పా.. అతను జట్టులో కొనసాగడం కష్టం. కోహ్లీ, రహానే సైతం ఈ సిరీస్‌లో తమను తాము నిరూపించుకోకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం ఖాయం.

భారీ స్కోర్‌కు బ్రేక్..
తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో మిడిలార్డర్ వైఫల్యం టీమిండియా భారీ స్కోర్‌కు బ్రేక్ వేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ 129) సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 83) భారీ స్కోరుకు పునాది వేశాడు. రాహుల్‌కు అండగా కోహ్లీ(42) కూడా నిలబడటంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది.
ఇక ఎన్నో అంచనాల మధ్య రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్‌లోనే సెంచరీ హీరో రాహుల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. ఆ మరుసటి ఓవర్‌లో రహానే క్యాచ్ ఔటయ్యాడు. దాంతో 282 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్(28 బ్యాటింగ్), జడేజా(9 బ్యాటింగ్) ఉన్నారు.


Click it and Unblock the Notifications
