Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: అర్షదీప్ సింగ్‌పై పిచ్చి రాతలు.. వికీపిడియాకు ప్రభుత్వం నోటీసులు!

Indian government Summons Wikipedia After Cricketer Arshdeep Singhs Page entry shows Khalistan link

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ -4 మ్యాచ్‌లో భారత ఓటమికి కారణమైన అర్షదీప్ సింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కీలక సమయంలో పాక్ బ్యాటర్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను అర్షదీప్ సింగ్ జారవిడిచాడు. అది కాస్త మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. దాంతో ఈ యువ పేసర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే అర్షదీప్ సింగ్ ఈ పని చేశాడని, పాకిస్థాన్‌కు అమ్ముడుపోయాడని ఆరోపించాడు. కొందరు అయితే జాతి వివక్ష వ్యాఖ్యలకు దిగారు. ఇక ఈ యువ పేసర్‌కు భారత ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు అండగా నిలిచారు. ఈ ట్రోలింగ్‌ను తిప్పికొట్టారు.

అయితే అర్షదీప్ సింగ్‌ ఖలిస్తాన్ మద్దతుదారుడని వికీపీడియాలో కనిపించడం కలకలం రేపింది. ఎవరో కావాలనే ఇలా ఎడిట్ చేసి ఇండియా అని ఉన్న ప్రతి చోటా ఖలిస్థాన్ అనే పదాన్ని చేర్చారు. ఈ వ్యవహారంపై భారత ఐటీ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ కోరుతూ వికీపీడియా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని ఆదేశించింది. ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నతస్థాయి ప్యానెల్ వికీపీడియా ప్రతినిధులను ప్రశ్నించనుంది. అలాగే, వికీపీడియాకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయనుంది.

ఇది చాలా తీవ్రమైన అంశమని, పొరుగు దేశంలో ఎడిట్ అయినట్టు గుర్తించామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి చర్యలు భారత అంతర్గత శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సవరణలను ఎలా అనుమతిస్తారని వికీపీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తామన్నారు. అర్షదీప్‌ సింగ్‌ వికీపీడియా పేజీ ఎంట్రీని మార్చి ఖలిస్థాన్‌ అనే పదాన్ని చేర్చడం వెనక పాకిస్థాన్‌కు చెందిన ఐపీ అడ్రస్ ఉందని ఆరోపించారు.

ఆస్క్ అన్షుల్ అనే ట్విటర్ యూజర్.. పాకిస్థాన్‌లో ఎడిట్ అయినట్లు సాక్ష్యాధారాలతో ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌లో ఎడిన చేసిన వారి ఐపీ అడ్రస్‌ను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

Story first published: Monday, September 5, 2022, 19:19 [IST]
Other articles published on Sep 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+