
క్రికెట్‌ను అంత తేలిగ్గా వదలను:
బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై శ్రీశాంత్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన శ్రీశాంత్ కాస్త భావోద్వేగం చెందాడు. 'ఐపీఎల్ 2021 కోసం బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో నా పేరు లేకపోవడం బాధగా ఉన్నా.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరింత సానుకూలంగా ముందుకు సాగుతా. నాపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు. నాకింకా 38 ఏళ్లే. క్రికెట్‌ను అంత తేలిగ్గా వదలను. మరింత ఎక్కువగా కష్టపడి వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తా' అని శ్రీశాంత్ అన్నాడు.

క్రిస్ గేలే మంచి ఉదాహరణ:
'ఐపీఎల్ 2021లో ఏదైనా అద్భుతం జరిగి అవకాశం వచ్చినా అసలు వదులుకోను. అందుకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేలే ఓ మంచి ఉదాహరణ. ఐపీఎల్ 2011 సీజన్‌లో గేల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ ఆ తర్వాత అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తా. ఒకవేళ ఆడే ఛాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటా' అని శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో శ్రీశాంత్‌పై విధించిన ఏడేళ్ల నిషేధం ముగిసింది. నిషేధం ముగిసిన తర్వాత అతడు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేరళ తరఫున ఆడాడు.

కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు:
శ్రీశాంత్ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది. 2019లో సుప్రీంకోర్టు అతడి నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో ఏడేళ్లకు కుదించింది. గతేడాది సెప్టెంబర్‌తో ఈ నిషేధం పూర్తయింది. అనంతరం దేశవాళి క్రికెట్‌లో కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొని ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఐపీఎల్ వేలం కోసం రూ.75 లక్షల కనీస ధరకు దరఖాస్తు చేసుకోగా తుది జాబితాలో చోటు దక్కలేదు.
44 ఐపీఎల్ మ్యాచులలో 40 వికెట్లు:
శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన జట్లలో శ్రీశాంత్ సభ్యుడు కావడం విశేషం. శ్రీశాంత్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన లక్కీ ఆటగాడిగా చూశాడు. శ్రీ 2008 నుంచి 13 వరకు 44 ఐపీఎల్ మ్యాచులు ఆడి 40 వికెట్లు పడగొట్టాడు. 3/29 అత్యుత్తమ గణాంకాలు.
India vs England: టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు.. చెపాక్ మైదానం వద్ద సందడే సందడి!!


Click it and Unblock the Notifications












