Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ ఆకాష్ దీప్.. అమ్మాయి ఎవరంటే..?

టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. బీహార్‌కు చెందిన ఈ స్టార్ బౌలర్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేశాడు. ఈ వేడుకకు పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం వేదిక అయింది. వారణాసిలోని ఓ హోటల్‌లో అక్షితా రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. రెండ్రోజుల కిందటే బిహార్‌లోని స్వగ్రామంలో పెళ్లి వేడుకలు ప్రారంభం కాగా బుధవారం బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది. పలువురు క్రికెటర్లు వేడుకకు హాజరై డ్యాన్స్‌లు వేసి సందడి చేశారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా.. తమ సంప్రదాయం మేరకు ఆకాష్ దీప్ ఖడ్గంతో కన్పించాడు.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం! జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఎలా చూడాలంటే?

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం! జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఎలా చూడాలంటే?


ఎవరీ అక్షిత రాజ్?

ఆకాష్ దీప్ బీహార్‌లోని రోహతాస్ జిల్లా బడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా.. ఆయన సతీమణి అక్షిత రాజ్ కూడా అదే జిల్లాలోని మణికపూర్ నివాసి. ఆమె తండ్రి పేరు అమిత్ కుమార్ సింగ్. అక్షిత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరిద్దరిదీ పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి. చదువులో ఎంతో ప్రతిభావంతురాలైన అక్షిత రాజ్.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీసీఏ, ఎంసీఏ పట్టాలను అందుకుంది.

Indian Fast Bowler Akash Deep Singh Marries in Varanasi Who Is His Wife

ఉన్నత చదువులు చదివిన అక్షిత రాజ్‌కు ఒక ప్రముఖ ఐటీ కంపెనీ నుంచి భారీ ప్యాకేజీతో కూడిన ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆకాష్ దీప్‌తో పెళ్లి కోసం ఆమె ఆ భారీ ఆఫర్‌ను కూడా తిరస్కరించినట్లు సమాచారం. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆకాష్ దీప్ కెరీర్‌కు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీహార్ డీఎస్పీగా ఆకాష్ దీప్..

క్రికెట్‌లో ఆకాష్ దీప్ కనబర్చిన ప్రదర్శనకు గుర్తింపుగా బీహార్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే ఆయనకు గౌరవప్రదమైన డీఎస్పీ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. ప్రస్తుతం ఆకాష్ దీప్ ఆటకు దూరంగా ఉన్నాడు. తీవ్రమైన నడుపు నొప్పితో బాధపడుతున్న ఆకాష్ దీప్.. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గతేడాది చివరిసారిగా ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌ ఆడాడు.

వైభవ్ సూర్యవంశీ.. 16 ఏళ్ల సచిన్‌లా ఉన్నాడు: కపిల్ దేవ్

వైభవ్ సూర్యవంశీ.. 16 ఏళ్ల సచిన్‌లా ఉన్నాడు: కపిల్ దేవ్

కేవలం టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఆకాష్ దీప్.. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునే దశలో ఉన్నాడు. త్వరలోనే అతను మైదానంలోకి దిగి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నాడు. మునపటి ఫామ్, ఫిట్‌నెస్ సాధిస్తే.. టెస్ట్ ఫార్మాట్‌లో ఆకాష్ దీప్ టీమిండియాకు కీలక బౌలర్‌గా మారనున్నాడు.

Story first published: Thursday, June 25, 2026, 9:51 [IST]
Other articles published on Jun 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+