IND vs SA: బౌలింగ్ ఇవ్వనప్పుడు వెంకటేశ్ అయ్యర్ ఎందుకురా? రాహుల్‌పై ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్: టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ గైర్హాజరీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో జట్టును నడిపించిన రాహుల్ దారుణంగా విఫలమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పుల్లో రాహుల్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోలేకపోయాడని, దాంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ చెలరేగారని ఆరోపిస్తున్నారు.
అతని అనాలోచిత నిర్ణయాల వల్ల ఫీల్డర్లు, బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని, రాహుల్ కెప్టెన్సీ అర్థం కాక అయోమయానికి గురయ్యారని కామెంట్ చేస్తున్నారు. సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్‌గా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకున్న రాహుల్.. అతని చేత ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. దాంతో అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
204 పరుగుల భాగస్వామ్యం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా భారత కెప్టెన్.. వైఫల్యంతో బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రాసీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో చెలరేగడంతో భారత్ ముందు 297 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే 68 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. బవుమా, డస్సెన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించడంతో భారీ స్కోర్ చేసింది. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంలో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో రాహుల్‌పై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు మండిపడుతున్నారు.
అయ్యర్ ఎందుకురా?
కామెంటేటర్లు సైతం రాహుల్ వ్యూహాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. రాహుల్ కెప్టెన్సీ మాత్రం చర్చనీయాంశం అవుతుందని అభిప్రాయపడ్డారు. అసలు వెంకటేశ్ అయ్యర్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడమే తమను ఆశ్చర్యపరించిందని వ్యాఖ్యానించారు. బౌలింగ్ ఇవ్వనప్పుడు జట్టులో అతను ఎందుకని పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకుంటే జట్టుకు ఇంకా సహకారంగా ఉండేది కదా? అని అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెస్కే ప్రసాద్ సైతం..
ఇంత చెత్త కెప్టెన్సీ తాము ఇంతవరకు చూడలేదని కొందరు ఫ్యాన్స్ ఘాటుగా విమర్శిస్తున్నారు. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఏ మాత్రం పనికిరాడని, జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతని కెప్టెన్సీ వైఫల్యమే టీమిండియా కొంపముంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం రాహుల్ కెప్టెన్సీ తీరును తప్పుబట్టాడు. మైదానంలో అతను స్పాట్ ఆన్ నిర్ణయాలు తీసుకోలేకపోయాడని, తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని పేర్కొన్నాడు. ఆ క్రమంలోనే వెంకటేశ్ అయ్యర్‌కు బౌలింగ్ ఇవ్వలేకపోయాడని, ఎంత సేపు వికెట్ తీయాలనే ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో రాహుల్‌తో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ మొత్తం విఫలమైందని అభిప్రాయపడ్డాడు.
నీ కెప్టెన్సీ అర్థం అవడం లేదు సామీ..
ప్రధాన బౌలర్లంతా విఫలమైనప్పుడు ఆల్‌రౌండర్ అయిన వెంకటేశ్ అయ్యర్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడం ఏంటో? బంతినివ్వకుండా ఆల్‌రౌండర్‌ను జట్టులో ఉంచుకోవడం దేనికో అస్సలు అర్థం కావడం లేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. వెంకీకి బౌలింగ్ ఇవ్వనప్పుడు జట్టులోకి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. రాహుల్ నుంచి అత్యంత చెత్త కెప్టెన్సీ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications