Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: మాకు ఆ ఐరెన్ లెగ్ అంపైర్ వద్దు.. అతనుంటే భారత్ ఓడిపోవడం ఖాయం!

Indian fans request to icc dont appoint richard kettleborough as umpire for wtc final vs New Zealand

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో భారత అభిమానులు ఓ అంపైర్ విషయంలో తెగ కంగారు పడుతున్నారు. అతను గనుక అంపైరింగ్ చేస్తే భారత్‌కు కలిసిరాదంటున్నారు. గతంలో అనేక మ్యాచ్‌ల్లో ఇది జరిగిందని లెక్కలు చెబుతున్నారు. దయచేసి అతనికి ఈ మెగా ఫైనల్‌ అంపైరింగ్ బాధ్యతలు అప్పగించవద్దని ఐసీసీకి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టాన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. అయితే భారత అభిమానులు మాత్రం ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరోను మాత్రం అంపైర్‌గా నియమించొద్దని కోరుతున్నారు. 2014 నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. భారత్ ఆడిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేస్తే ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన గణంకాలను సైతం షేర్ చేస్తున్నారు.

2014 టీ20 ప్రపంచకప్‌తో..

2014 టీ20 ప్రపంచకప్‌తో..

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది.

ఆ టోర్నీలో ఆద్యాంతం అద్బుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఓటమెరగని జట్టుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నా సెమీఫైనల్లో భారత్ 95 పరుగులతో చిత్తుగా ఓడి ఇంటిదారిపట్టింది. ఈ మ్యాచ్‌లో కూడా రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేశాడు.

2016 టీ20 ప్రపంచకప్‌లో..

2016 టీ20 ప్రపంచకప్‌లో..

భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 192 పరుగులు భారీ స్కోర్ చేసిన భారత్.. విండీస్ వీరుల విధ్వంసంతో కాపాడుకోలేకపోయింది.

వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేశాడు. ఇక 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కెటిల్‌బర్ ఐరెన్ లెగ్ అంపైరింగ్ పుణ్యమా.. ఐసీసీ ఈవెంట్లో పాక్ చేతిలో ఎన్నడూ ఓడని కోహ్లీసేన చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగులతో ఓడి టైటిల్ చేజార్చుకుంది.

న్యూజిలాండ్ చేతిలోనూ..

న్యూజిలాండ్ చేతిలోనూ..

ఇక 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఈ సెంటిమెంటే రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన కోహ్లీసేన.. సెమీఫైనల్లో మాత్రం చిత్తయింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో ధోనీ, జడేజా పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. చివర్లో మార్టిన్ గుప్తిల్ వేసిన త్రోకు ఎంఎస్ ధోనీ రనౌట్ అవ్వడం.. లెగ్ అంపైర్‌గా ఉన్న కెటల్‌బరో 'ఓ'అని బాధపడుతూ.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరడం అందరికి గుర్తే.

కెటిల్ బరో అంపైరింగ్ కారణంగా భారత్ ఓడిపోకున్నా.. అతను బాధ్యతలు నిర్వర్తించిన కీలక మ్యాచ్‌లన్నింటిలోనూ ఓటమిపాలైంది. అందుకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతన్ని అంపైర్‌గా నియమించవద్దని ఐసీసీని కోరుతున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా..

డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా..

ప్రస్తుతం కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉండటంతో ఆయా దేశాల్లో ఉండే ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లతోనే టెస్ట్, వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఐసీసీ ప్యానల్‌లో ఎక్కువగా ఇంగ్లండ్ అంపైర్లే ఉన్నారు. వారిలో రిచర్డ్ కెటిల్‌బరో ఒకరు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇంగ్లండ్ అంపైర్లు ఎలాగో తటస్థ అంపైర్లుగానే ఉంటారు.

ఈ లెక్కన సీనియర్ అయిన కెటిల్‌బరోకే అంపైరింగ్ చేసే అవకాశాలు దక్కనున్నాయి. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ మీమ్‌ను షేర్ చేశాడు. కెటిల్‌బరో వద్దని శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేనను అంపైర్‌గా నియమించాలని కోరాడు.

Story first published: Monday, May 31, 2021, 16:26 [IST]
Other articles published on May 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+