ద్రవిడ్ ఎలెవన్ X శాస్త్రి ఎలెవన్..
ఇక ఈ విజయంపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గబ్బర్ సేనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ టీమ్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. ధావన్ సేనకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తుంటే.. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లీసేనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ద్రవిడ్ సేన X శాస్త్రి సేన మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుందని ట్వీట్ చేస్తున్నారు.
ద్రవిడ్ టీమ్‌లోకి రోహిత్‌ను ఇచ్చి..
అయితే ఈ మ్యాచ్‌లో గబ్బర్ సేననే గెలుస్తుందని అభిమానులు కామెంట్ చేయడం విశేషం. అంతేకాకుండా కోహ్లీ సేనలో ఉన్న రోహిత్ శర్మను ద్రవిడ్ టీమ్‌లోకి తీసుకొచ్చి వారికి పడిక్కల్‌ను ఇవ్వాలని అప్పుడు రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే కోహ్లీసేనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ద్రవిడ్ ఎలెవన్ 194 పరుగులకు డిక్లేర్ చేస్తే.. శాస్త్రి ఎలెవన్ 49 పరుగులకే ఆలౌట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ధనాధన్ బ్యాటింగ్‌తో ద్రవిడ్ సేన దుమ్ములేపుతుందంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది.
ఆల్కహాల్ టెస్ట్ చేయాలి..
ఈ మ్యాచ్ ప్రతిపాదనపై కొందరు అభిమానులు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు రవిశాస్త్రి టీమ్ మొత్తానికి ఆల్కహాల్ టెస్ట్ చేయాలని సెటైర్లు పేల్చుతున్నారు. ఇంకొందరు మాత్రం ఈ ప్రతిపాదనను తప్పుబడుతున్నారు. రెండు టీమ్స్ మధ్య మ్యాచే అనవసరమని, రెండు జట్లు భారత్‌వేననే విషయం మరిచిపోవద్దని సూచిస్తున్నారు. ఇలా అయితే ఇంగ్లండ్ టీమ్ ఇయాన్ మోర్గాన్, రూట్ సేన, స్టోక్స్ సేన అంటూ ట్రై సిరీస్‌లే నిర్వహించాలని కామెంట్ చేస్తున్నారు.
అలవోక విజయం..
ఫస్ట్ వన్డేలో గబ్బర్ సేన అలవోక విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. చమిక కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ దసున్ షనక (50 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్ష్యఛేదనలో భారత్ 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయ అర్ధ సెంచరీతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇషాన్, పృథ్వీ షా మెరుపులు మెరిపించారు


Click it and Unblock the Notifications
