IND vs PAK: పాక్ ప్లేయర్‌ను కొనియాడుతున్న భారత అభిమానులు.. ఎందుకంటే..? (వీడియో)

దుబాయ్: పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫకార్ జమాన్‌పై భారత అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆసియాకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఫకార్ జమాన్ క్రీడా స్పూర్తిని చాటాడు. యుద్దంలా భావించే మ్యాచ్‌లో చీటింగ్ చేయడానికి అవకాశం ఉన్నా తన నిజాయితీని చాటుకున్నాడు. దాంతో ఫకార్ జమాన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. ముఖ్యంగా భారత్ అభిమానులు అతను చూపిన క్రీడాస్పూర్తికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
పాకిస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి ఫకార్ జమాన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే భారత ఆటగాళ్లు అప్పీల్ చేయకున్నా అతను నిజాయితీగా తాను ఔటని స్వంతగా ఒప్పుకొని పెవిలియన్‌వైపు నడిచాడు. దాంతో భారత ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆవేశ్ ఖాన్ వేసిన బౌన్సర్‌ను ఫకార్ హుక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ టైమింగ్ తప్పడంతో బంతి బ్యాట్ అంచును తాకుతూ కీపర్ దినేశ్ కార్తీక్ చేతిలో పడింది. ఎలాంటి శబ్దం రాకపోవడంతో బౌలర్, కీపర్‌తో సహా ఎవరూ అప్పీల్ చేయలేదు.
చెవులు దొబ్బినయా..?
కనీసం అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా వేచి చూడని ఫకార్ పెవిలియన బాట పట్టాడు. మహ్మద్ రిజ్వాన్ ఆలోచించమని చెప్పినా వినకుండా ఫఖర్ వెళ్లిపోయాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను స్లిక్ చేస్తు వెళ్లినట్లు స్పైక్ వచ్చింది. అప్పటికి కార్తిక్ మాత్రం ఏం తగల్లేదు అని సైగ చేయడం కనిపించింది. ఆవేశ్ ఖాన్ సౌండ్ వినిపించలేదా? చెవులు దొబ్బయా? అని కార్తీక్‌ను అడగ్గా.. వినబడలేదంటూ సైగలు చేశాడు.
పాక్ 147 ఆలౌట్..
భువనేశ్వర్ కుమార్(4/26), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(3/25) సత్తా చాటడంతో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. అయితే ఓ దశలో పాక్ 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ చివరి బ్యాటర్ షానవాజ్ దహని(6 బంతుల్లో 2 సిక్స్‌లతో 16) కీలక పరుగులతో 148 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. పాక్ జట్టులో బాబర్ ఆజామ్(42 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.

రాహుల్ డకౌట్..
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(0) మరోసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పాకిస్థాన్‌పై అతని పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. అరంగేట్ర బౌలర్ నసీమ్ షా బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే విరాట్ ఇచ్చిన క్యాచ్‌ను పాక్ రిజ్వాన్ నేలపాలు చేశాడు. దాంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఈ అవకాశాన్ని అందుకున్న కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. 7 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications