అన్నింటిలో విఫలం..
తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించే వ్యూహాలు.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పులు ఇలా అన్నింటిలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని, చెత్త బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీపై వేటు వేయాల్సిన సమయం వచ్చిందని, కొత్త కోచ్, కెప్టెన్ నియమించాల్సిన టైమ్ ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు.
అసలు కోహ్లీనే ఓ అన్‌లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరాలేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. ఫైనల్లో ఓడిపోవడం అలవాటు అయిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ అయినా..
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే కనీసం టీ20 ప్రపంచకప్ అయినా గెలుస్తామని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీలో రోహిత్ పరుగుల మోత మోగించాడని, కానీ కోహ్లీసేన టైటిల్ గెలవలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు. తమకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కావాలని డిమాండ్ చేస్తున్నారు. WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. కీలక మ్యాచ్‌ల్లో ఓడటం కోహ్లీకి అలవాటు అయిపోయిందని, కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ కానీ గొప్ప కెప్టెన్ అయితే కాదని కామెంట్ చేస్తున్నారు.
కోచ్‌ను కూడా మార్చాలి..
హెడ్ కోచ్ రవిశాస్త్రిని సైతం మార్చాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించాలని, తాగుబోతు రవిశాస్త్రితో జట్టుకు ఒరిగిందేం లేదని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 చాంపియన్స్ ట్రోఫీలు కోహ్లీ చెత్త కెప్టెన్సీ వల్లే పోయాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్‌తో పాటు ద్రవిడ్‌ను కొత్త కోచ్‌గా నియమిస్తే టీ20 ప్రపంచకప్‌ను సునాయసంగా గెలుస్తామని లేకుంటే.. మరో ఐసీసీ టైటిల్ కూడా దూరమవుతుందని హెచ్చరిస్తున్నారు.
బ్రిస్బేన్ టెస్ట్ టీమ్‌ను ఆడించినా..
డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా టూర్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన జట్టును ఆడించినా టీమిండియా సునాయసంగా గెలిచేదని కామెంట్ చేస్తున్నారు. యువ ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు అద్భుతంగా రాణించందన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఓవర్‌నైట్ స్కోరు 64/2తో బుధవారం ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది.
రిషభ్ పంత్ (88 బంతుల్లో 41; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. అనంతరం మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) మూడో వికెట్‌కు 96 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.


Click it and Unblock the Notifications












