టీమ్ కాంబినేషన్ కోసమే..
అయితే పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్ నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా రోహిత్ వివరణ ఇచ్చాడు. మూడో పేసర్‌గా ఆవేశ్ ఖాన్ జట్టులోకి రావడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం దినేశ్ కార్తీక్‌ను తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. అయితే అభిమానులు మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ చాయిస్ కీపర్ అంటూనే పంత్‌ను పక్కనపెట్టేసారు కదా? అని సెటైర్లు పేల్చుతున్నారు. అసలు ఈ పరిస్థితి వస్తుందని పంత్ కూడా ఊహించి ఉండడని కామెంట్ చేస్తున్నారు.
X ఫ్యాక్టర్ ఆటగాడిని..
జట్టులో X ఫ్యాక్టర్ ఆటగాడైన రిషభ్ పంత్‌ను పక్కనపెట్టారని, ఇది జట్టుకు చాలా ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే దీనికి కారణం రోహిత్ శర్మనేనని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వడాపావ్ పక్కనే ఉండి పంత్ కొంప ముంచాడని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ కాంబినేషన్ ఏంటో అర్థం కావడం లేదని, పంత్ లేని లోటు తెలిసొస్తుందంటున్నారు. ఏ లెక్కన చూసుకున్నా దినేశ్ కార్తీక్ కంటే పంత్ ఆట ఎంతో మెరుగైందని అభిప్రాయపడుతున్నారు.
విరాట్ కోహ్లీ 100
ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అధిగమించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ (టెస్టు, వన్డే, టి20) కనీసం 100 మ్యాచ్‌ల చొప్పున ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ తొలిసారి ఈ ఘనతను అందుకోగా విరాట్ అతని సరసన చేరాడు. భారత్, పాక్ మధ్య 9 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. ఆరింటిలో భారత్, రెండింటిలో పాక్ గెలిచాయి. మరో మ్యాచ్ 'టై' అయింది.
బాబర్ ఔట్..
టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన భారత్ శుభారంభం అందుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే డేంజరస్ వికెట్‌ను పడగొట్టింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్(10)ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఎల్బీ అయ్యే ప్రమాదం నుంచి బాబర్ రివ్యూతో తప్పించుకున్నా.. మూడో ఓవర్‌లో షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. భువీతో కలిసి కెప్టెన్ రోహిత్ పన్నిన పన్నాగం ఫలించింది. ఇక ఐదు ఓవర్లు ముగిసేసరికి పాక్ వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications
