
పీఎస్‌ఎల్ వరల్డ్ బెస్ట్..
'ఈ ప్రపంచంలోనే పీఎస్‌ఎల్ అత్యంత ఆసక్తికరమైన లీగ్. కోవిడ్-19 కారణంగా గానీ, మరే విషయాల్లో గానీ ఆటంకాలు ఎదురవ్వకుంటే ఈ పాకిస్థాన్ లీగ్‌కు తిరుగులేదు. ఎందుకంటే ఈ లీగ్ పిచ్‌ల స్వభావం అలా ఉంటుంది. లాహోర్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటే.. కరాచీలో బ్యాట్స్‌మన్ చెలరేగుతారు. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఒకే రకమైన క్రికెట్ ఉంటుంది. పూర్తి ఫ్లాట్ పిచ్‌లపై మ్యాచ్‌లు జరుగుతుంటాయి. లో క్వాలిటీ బౌలింగ్ ఉంటుంది.'అని అకీబ్ జావెద్ పీటీవీ స్పోర్ట్స్ చానెల్‌కు తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్ జర్నలిస్ట్ ట్వీట్ చేయగా.. జావెద్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ ముందు జుజూబీ..
ఐపీఎల్ కాలి గోటికి కూడా పీఎస్‌ఎల్ పనికిరాదని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు పాకిస్థాన్ లీగ్ జుజుబీ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లంతా క్యూ కడుతున్నారని గుర్తు చేస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్న జావెద్‌ను మెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. కొందరైతే జావెద్ కామెడీ చేస్తున్నాడని, ఇలానే అందర్నీ నవ్విస్తూ ఉండాలని సెటైర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్, పీఎస్‌ఎల్ ఆటగాళ్ల కాంట్రాక్టులు పోల్చినా.. వ్యూయర్ షిప్ లెక్కలు తీసినా ఏ లీగ్ గొప్పదో తెలిసిపోతుందని చురకలంటిస్తున్నారు.

రషీద్ లతీఫ్ సైతం..
పాకిస్థాన్ మాజీ వికెట్‌కీపర్ రషీద్ లతీఫ్ సైతం భారత క్రికెట్ అభిమానులను ఉద్దేశించి ఇదే తరహా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు లేరని టీమిండియా ఫ్యాన్స్ బాధపడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్ పరిమిత ఓవర్ల ఓపెనింగ్ జోడీ(బాబర్, రిజ్వాన్)పై ప్రశంసల వర్షం కురిపించిన లతీఫ్.. భారత అభిమానులను తక్కువ చేసి మాట్లాడాడు. ఏడాది కిందట పాక్ అభిమానులు సైతం తమ జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు లేరని బాధపడేవాళ్లని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో బాబర్, రిజ్వాన్ ద్వయం తిరుగులేనిదని, ఈ జోడీ మున్ముందు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని జోస్యం చెప్పాడు. తమ దేశ క్రికెటర్లను ఆకాశానికెత్తిన లతీఫ్.. విరాట్, రోహిత్‌లలో మునుపటి పదను లేదని పేర్కొన్నాడు. లతీఫ్ కామెంట్స్‌ను కూడా భారత అభిమానులు తిప్పికొట్టారు.


Click it and Unblock the Notifications












