Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA:దండంరా అయ్యా! మీకు గాయాలైనా బాగుండు! పుజారా, రహానే వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్!

Indian Fans Fires On Pujara And Ajinkya Rahane Continues Failure In Test Cricket

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో‌నూ టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(33 బంతుల్లో 3), అజింక్యా రహానే(0) దారుణంగా విఫలమయ్యారు. ఓలివర్ పేస్ ధాటికి వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. పుజారా క్రీజులో నిలదొక్కుకోవడానికి తెగ ఇబ్బంది పడగా.. రహానే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ తొలి సెషన్‌లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి 26 ఓవర్లలో 3 వికెట్లకు 53 రన్స్ చేసింది. క్రీజులో కెప్టెన్ కేఎల్ రాహుల్(74 బంతుల్లో 4 ఫోర్లతో 19 బ్యాటింగ్), హనుమ విహారి(12 బంతుల్లో 4 బ్యాటింగ్) ఉన్నారు. అయితే వరుసగా విఫలమవుతున్న పుజారా, రహానేలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్ ఖేల్ ఖతమ్..

గతేడాదికాలంగా ఈ ఇద్దరూ దారుణంగా విఫలమవుతున్నా వరుసగా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని నిలదీస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనూ ఈ ఇద్దరు విఫలమయ్యారు. అయినా విన్నింగ్ కాంబినేషన్ మార్చే ఉద్దేశంలేక ఈ ఇద్దరికి చోటిచ్చారు. కానీ వీరు ఏ మాత్రం సత్తాచాటలేకపోతున్నారు. జట్టుకు భారంగా మారుతున్నారు. దాంతో అభిమానులు ఈ ఇద్దరి ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఇద్దరికి గాయాలైనా బాగుండని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి కెరీర్ ముగిసినట్లేనని ట్రోల్ చేస్తున్నారు.

బౌలర్లూ రాణించకుంటే..

భారత పేస్ విభాగం రాణించకుంటే.. పుజారా, రహానే ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడుకునేవాళ్లని అభిప్రాయపడుతున్నారు. భారత పేసర్లు సత్తా చాటడంతో అద్భుత విజయాలందుకుందని, వారే లేకుంటే భారత్ జట్టు ఘోరంగా విఫలమయ్యేదని అప్పుడు ఈ ఇద్దరు జట్టులో చోటు కోల్పోయేవారని కామెంట్ చేస్తున్నారు. పుజారా, రహానే జట్టుకు అందించిన సేవలు చాలని, ఇక వీరిని భరించే శక్తి తమకు లేదని సెటైర్లు పేల్చుతున్నారు. వెంటనే జట్టు నుంచి ఉద్వాసన పలికి యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

పుజారాను వెంటాడిన ‘3'

తాజా మ్యాచ్‌లో పుజారా 33 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 33 ఏళ్ల పుజారా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 33 బంతులాడి 3 పరుగులు చేసి ఔటయ్యాడన్నాడు. మొత్తానికి 3 అనే అంకే పుజారాను వెంటాడిందని కామెంట్ చేస్తున్నారు. 2020 నుంచి నిలకడగా పుజారా, రహానే విఫలమవుతున్నారని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 2020 నుంచి పుజారా 19 టెస్ట్‌ల్లో 25.52 సగటుతో 868 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేదు. ఇక రహానే 35 ఇన్నింగ్స్‌ల్లోని దాదాపు 12 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమయ్యాడు.

Story first published: Monday, January 3, 2022, 16:34 [IST]
Other articles published on Jan 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+