Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Richard Kettleborough: మాకు శనిలా దాపురించావుగా రిచర్డ్ మామ.. అంపైర్‌‌పై పేలుతున్న సెటైర్స్!

Indian Fan Trolls Umpire Richard kettleborugh For Knocking out form t20 world cup

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన.. టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్రూప్‌-2లో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయింది. ఈ ఓటమితో భారత సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. అయితే ఈ ఓటమికి అంపైర్ రిచర్డ్ కెటిల్ బరోనే కారణమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు కెటిల్ బరో అంపైర్‌గా ఉండటంతోనే టీమిండియాకు కలిసిరాలేదని, టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ఓడిపోవడం వరకు అన్నీ ప్రతికూలమే అయ్యాయని ట్రోల్స్ చేస్తున్నారు. భారత జట్టుకు రిచర్డ్ శనిలా దాపురించాడని, ప్రపంచకప్ అతను అంపైరింగ్ చేసిన ప్రపంచకప్​ నాకౌట్ మ్యాచ్​ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదని గుర్తు చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తాజా మ్యాచ్ కూడా క్వార్టర్ ఫైనల్ లాంటిదని అందుకే టీమిండియాకు ఓటమి తప్పలేదంటున్నారు.

ఇక నెటిజన్లు చెప్పినట్లే 2014 నుంచి 2021 టెస్ట్ చాంపియన్‌షిప్‌వరకు.. భారత్ ఆడిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేస్తే టీమిండియా ఓడిపోయింది. ఆఖరి అతను టీవీ అంపైర్‌గా ఉన్న విజయం దక్కలేదు.

2014 టీ20 ప్రపంచకప్‌తో..

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ టోర్నీలో ఆద్యాంతం అద్బుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఓటమెరగని జట్టుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 95 పరుగులతో చిత్తుగా ఓడి ఇంటిదారిపట్టింది. ఈ మ్యాచ్‌లో కూడా రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేశాడు.

2016 టీ20 ప్రపంచకప్‌లో..

భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 192 పరుగులు భారీ స్కోర్ చేసిన భారత్.. విండీస్ వీరుల విధ్వంసంతో కాపాడుకోలేకపోయింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేశాడు. ఇక 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కెటిల్‌బర్ ఐరెన్ లెగ్ అంపైరింగ్ పుణ్యమా.. అప్పటివరకు ఐసీసీ ఈవెంట్లో పాక్ చేతిలో ఎన్నడూ ఓడని కోహ్లీసేన చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగుల తేడాతో ఓడి టైటిల్ చేజార్చుకుంది.

కివీస్ చేతిలో వరుసగా మూడు సార్లు..

ఇక 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఈ సెంటిమెంటే రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన కోహ్లీసేన.. సెమీఫైనల్లో మాత్రం చిత్తయింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో ధోనీ, జడేజా పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. చివర్లో మార్టిన్ గుప్తిల్ వేసిన త్రోకు ఎంఎస్ ధోనీ రనౌట్ అవ్వడం.. లెగ్ అంపైర్‌గా ఉన్న కెటల్‌బరో 'ఓ'అని బాధపడుతూ.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరడం అందరికి గుర్తే. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కెటిల్ బరో మైదానంలోకి దిగకున్నా.. భారత్‌కు ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో కెటిల్ బరో టీవీ అంపైర్‌గా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లోని తాజా మ్యాచ్‌లోనూ అదే ఫలితం ఎదురైంది. అయితే ఈ ఐరెన్ లెగ్ అంపైర్ వల్ల భారత్ ప్రతీసారి ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలోనే కెటిల్ బరోను భారత అభిమానులు విమర్శిస్తున్నారు.

ఇక ఇంటికే..

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. జడేజా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ 26 నాటౌట్)నే భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌. తర్వాత న్యూజిలాండ్‌ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా.. విలియమ్సన్‌ (31 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయంగా నిలబడి మ్యాచ్ ముగించాడు.

Story first published: Monday, November 1, 2021, 15:26 [IST]
Other articles published on Nov 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+