For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహ్మద్ సిరాజ్‌‌ను ఎవరు తిట్టలేదు.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేయలేదు: ప్రత్యక్ష సాక్షి

 Indian fan says Mohammad Siraj was not abused at all, adds twist in the racial discrimination case

సిడ్నీ: మహ్మద్ సిరాజ్ జాత్యహంకార వ్యాఖ్యల కేసులో మరో వాదన తెరపైకి వచ్చింది. అసలు సిరాజ్‌ను ఎవరూ దూషించలేదని, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయనే లేదని ప్రత్యక్ష సాక్షి, మ్యాచ్‌కు హాజరైన ఓ భారత అభిమాని తెలిపాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మూడో రోజు, నాలుగో రోజు ఆటలో కొందరు అభిమానులు తనపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారని సిరాజ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతన్ని బ్రౌన్ డాగ్, మంకీ అని పిలిచారన్నాడు. దాంతో ఆటను నిలిపివేసిన అంపైర్లు పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించడంతో పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు.

 ఒక్క మాట అనలేదు..

ఒక్క మాట అనలేదు..

ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. రేసిజం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యావత్ క్రికెట్ ప్రపంచం ముక్త కఠంతో పిలుపునిచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే అసలు సిరాజ్‌ను ఎవరూ తిట్టలేదని భారత అభిమాని అయిన ప్రతీక్ కెల్కర్ చెప్పడం చర్చనీయాంశమైంది. నాలుగో రోజు ఆటలో రెండు సిక్స్‌లు సమర్పించుకున్న చికాకులో సిరాజే తనను దూషించారని పొరబడ్డాడని కెల్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా అభిమానులు సిరాజ్‌ను ఒక్క మాట అనలేదని, 'వెల్ కమ్ టు సిడ్నీ సిరాజ్'అని మాత్రమే అన్నారని తెలిపాడు. ఈ విషయం చెప్పిన తనను కూడా ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌తో బయటకు పంపించారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ కెల్కర్ చెప్పుకొచ్చాడు.

సిక్స్‌లు కొట్టారనే చికాకులో..

సిక్స్‌లు కొట్టారనే చికాకులో..

'సిరాజ్‌ను వారు ఏం అనలేదని చెప్పినందుకు మమ్మల్ని కూడా బయటకు పంపించేశారు. అంతకు ముందు సిరాజ్ తన ఓవర్‌లో రెండు సిక్స్‌లు సమర్పించుకున్నాడు. దాంతో అతను చాలా చికాకుకు గురయ్యాడు. బౌండరీ లైన్ వద్దకు వచ్చిన అతన్ని ఆసీస్ అభిమానులు.. 'వెల్‌కమ్ టు సిడ్నీ సిరాజ్'అని గట్టిగా అరిచారు. వారిని అతను అడ్డుకున్నాడు. ఆ తర్వాత జరిగింది తెలిసిందే. అంపైర్లకు ఫిర్యాదు చేయడం, వారు పోలీసులతో ఆ అభిమానులకు బయటకు పంపించారు.

ఒక్కరిని అరెస్ట్ చేయలేదు..

ఒక్కరిని అరెస్ట్ చేయలేదు..

ఈ ఘటనపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా పోలీసులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని కెల్కర్ స్పష్టం చేశాడు. ఎందుకంటే అక్కడ జరిగిందేం లేదన్నాడు. పోలీసులు కూడా రెండు వైపులు వారి వాదనలు విన్నారన్నాడు. 'బయటకు పంపించడం తప్పా వారు చేసేందేం లేదు. తాము రెండు వైపుల వింటామని పోలీసులు అన్నారు. ఇప్పటి వరకైతే ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ ఆఖరి రోజు ఆటను మేం మిస్సయ్యాం'అని కెల్కర్ పేర్కొన్నాడు.

మ్యాచ్ డ్రా..

మ్యాచ్ డ్రా..

అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్ మూడో టెస్టును 'డ్రా'గా ముగించి సిరీస్‌లో 1-1తోనే సమాన స్థితిలో నిలిచింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్‌ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్‌ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్‌; 4 ఫోర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (128 బంతుల్లో 39 నాటౌట్‌; 7 ఫోర్లు)ల మారథాన్‌ భాగస్వామ్యంతో మ్యాచ్‌ 'డ్రా'గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్‌లో నిలిచి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించారు

Story first published: Tuesday, January 12, 2021, 15:21 [IST]
Other articles published on Jan 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+